Homeటాప్ స్టోరీస్రాఖీభాయ్‌లా ఉపేంద్ర మెస్మ‌రైజ్ చేస్తాడా?

రాఖీభాయ్‌లా ఉపేంద్ర మెస్మ‌రైజ్ చేస్తాడా?

రాఖీభాయ్‌లా ఉపేంద్ర మెస్మ‌రైజ్ చేస్తాడా?
రాఖీభాయ్‌లా ఉపేంద్ర మెస్మ‌రైజ్ చేస్తాడా?

క‌న్న‌డ ఇండ‌స్ట్రీ కేజీఎఫ్ కి ముందు.. త‌రువాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే `కేజీఎఫ్‌`కి ముందు క‌న్న‌డ చిత్రాల‌కు దేశ వ్యాప్తంగా పెద్ద పేరు లేదు. ప్ర‌ముఖంగా చెప్పుకున్న సంద‌ర్భాలూ త‌క్కువే.. ఉపేంద్ర న‌టించి రూపొందించిన `ఏ`, ఉపేంద్ర‌, రా చిత్రాలు, సాయి కుమార్ న‌టించిన `పోలీస్‌స్టోరీ` క‌న్న‌డ సినిమాకు కొంత మేర గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

అయితే పాన్ ఇండియా స్థాయిలో మాత్రం క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి గుర్తింపు ల‌భించింది య‌ష్ న‌టించిన `కేజీఎఫ్‌` త‌రువాతే. ఈ సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. తాజాగా ఇదే ఇండ‌స్ట్రీ నుంచి మ‌రో పాన్ ఇండియా మూవీ వ‌స్తోంది. అదే `క‌బ్జ‌`. ఉపేంద్ర హీరోగా న‌టిస్తున్నారు. ఐదు భాష‌ల్లో ఒకే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆర్‌. చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా మ‌రాఠీ, ఒరియా భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -

ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. `కేజీఎఫ్` చిత్రానికి సంగీతం అందించిన ర‌వి బాస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మోష‌న్ పోస్ట‌ర్‌కి అందించిన నేప‌థ్య సంగీతం ఈ సినిమా డామ్ ష్యూర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే సంకేతాల్ని అందిస్తోంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీతో రాఖీభాయ్ త‌ర‌హాలో ఉపేంద్ర మెస్మ‌రైజ్ చేస్తాడా అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All