Homeన్యూస్బాలయ్య అన్ స్టాపబుల్ లో రెండో గెస్ట్ కూడా కన్ఫర్మ్

బాలయ్య అన్ స్టాపబుల్ లో రెండో గెస్ట్ కూడా కన్ఫర్మ్

బాలయ్య అన్ స్టాపబుల్ లో రెండో గెస్ట్ కూడా కన్ఫర్మ్
బాలయ్య అన్ స్టాపబుల్ లో రెండో గెస్ట్ కూడా కన్ఫర్మ్

ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ షో మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మంచు ఫ్యామిలీ సందడి చేసిన ఈ షో మంచి టాక్ ను తెచ్చుకుంది. హయ్యస్ట్ వ్యూస్ సాధించిన ఎపిసోడ్ గా నిలిచింది.

మొదటి ఎపిసోడ్ కు భీభత్సమైన రెస్పాన్స్ రావడంతో రెండో ఎపిసోడ్ కు మరింత ఉత్సాహం తోడైంది. రెండో ఎపిసోడ్ లో గెస్ట్ ఎవరు అన్నది ఇప్పుడు రివీల్ అయింది. అన్ స్టాపబుల్ రెండో ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తాడని అధికారికంగా తెలియజేసారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ అప్డేట్ తో పాటు కొన్ని పిక్చర్స్ ను కూడా విడుదల చేసారు. ఇందులో నాని, బాలయ్య మధ్య బాండింగ్ కూడా తెలుస్తోంది.

- Advertisement -

ఈ ఎపిసోడ్ ను కూడా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. అటు బాలయ్య హోస్టింగ్ స్కిల్స్ తో పాటు ఎపిసోడ్ లో అడిగే ప్రశ్నలు కూడా బాగుంటున్నాయి. త్వరలోనే నాని ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All