Homeటాప్ స్టోరీస్టీవీ నటి కిడ్నాప్ కలకలం

టీవీ నటి కిడ్నాప్ కలకలం

Lalitha
Lalitha

తెలుగు సీరియల్ లలో నటించే లలిత అనే నటిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది . సంచలనం సృష్టించిన సంఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది . ప్రేమ , కల్యాణ వైభవం . స్వర్ణ ఖడ్గం తదితర సీరియల్ లలో నటిస్తున్న లలిత అమీర్ పేటలోని విమెన్స్ హాస్టల్ లో ఉంటోంది . అయితే అపరిచితుడు వచ్చి లలితని తీసుకెళ్లినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు

అపరిచిత వ్యక్తితో బయటకు వెళ్లిన లలిత మళ్ళీ హాస్టల్ కు తిరిగి రాకపోవడంతో ఆమె తలిదండ్రులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు . లలిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . లలిత స్వస్థలం అనంతపురం ధర్మవరం .కాగా ఏడాది నుండి సీరియల్ లలో నటిస్తోంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All