Homeటాప్ స్టోరీస్అచ్చం జయలలితలా

అచ్చం జయలలితలా

Nithya menon stunning look from THE IRON LADYఈరోజు జయలలిత బయోపిక్ ది ఐరన్ లేడీ అనే సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు . ఆ పోస్టర్ లో నిత్యా మీనన్ అచ్చం జయలలిత లా ఉండటంతో వెంటనే చూపు తిప్పుకోలేకపోతున్నారు , అంత బాగా కుదిరింది నిత్యా మీనన్ . ఇది బయోపిక్ ల కాలం అయిపొయింది . బాలీవుడ్ లో ఎప్పటినుండో ఈ సినిమాలు వస్తుండగా టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ మొదలయ్యింది . జయలలిత అంటే తమిళనాడుకు విడదీయలేని బంధం . సినిమారంగాన్ని తీసుకున్నా , రాజకీయ రంగాన్ని తీసుకున్నా జయలలిత పాత్ర లేనిదే అది పరిపూర్ణం కాదు . తమిళనాట చెరగని ముద్ర వేసింది పురుచ్చి తలైవి జయలలిత .

అయితే జయలలిత చివరి పేజీలు మాత్రం అత్యంత వివాదాస్పదం అయ్యాయి . ఆమె చావుకు సరైన కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు . ఆ విషయాన్నీ పక్కన పెడితే ది ఐరన్ లేడీ పేరిట అమ్మ బయోపిక్ చేయాలనీ ప్రియదర్శిని ఆమె మహిళా దర్శకురాలు ప్రయత్నాలు చేస్తోంది . అందులో భాగంగా నిత్యా మీనన్ లుక్ ని రిలీజ్ చేయగా అచ్చం జయలలిత లా ఉండటంతో అందరూ ఫిదా అవుతున్నారు . అయితే అది మార్ఫింగ్ లా కనబడుతోంది . మొత్తానికి నిత్యా మీనన్ అమ్మ జయలలిత ని తలపించేలా కనిపిస్తోంది . అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో ?

- Advertisement -

English Title: Nithya menon stunning look from THE IRON LADY

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All