Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఆ బయోపిక్ లో నటించనని తేల్చి చెప్పింది

ఆ బయోపిక్ లో నటించనని తేల్చి చెప్పింది

Keerti suresh sensational comments on jayalalitha biopicతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించనని , అది అంత తేలికైన పని కాదని అంటోంది కీర్తి సురేష్ . మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటించడం ఆ సినిమా సంచలన విజయం సాధించడం కీర్తి సురేష్ నటనకు ప్రశంసలు లభించడంతో జయలలిత బయోపిక్ లో కీర్తి సురేష్ అయితేనే బాగుంటుంది అని అభిప్రాయానికి వచ్చారు . అయితే జయలలిత బయోపిక్ అంటూ వార్తలు వస్తున్నాయి ఆ సినిమాని తీయడానికి ముగ్గురు నలుగురు నిర్మాతలు ముందుకు వస్తున్నారు , ప్రకటనలు గుపిస్తున్నారు కానీ ఏది కూడా ఇంతవరకు మెటీరియల్ కాలేదు .

- Advertisement -

అంతేకాదు జయలలిత బయోపిక్ లో ఐశ్వర్యా రాయ్ , విద్యా బాలన్ , అనుష్క ఇలా చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి అదే సమయంలో కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది దాంతో కీర్తి సురేష్ స్పందించింది . జయలలిత గొప్ప నటి అలాగే గొప్ప నాయకురాలు కూడా అంతటి గొప్ప మహిళా కథతో తెరకెక్కే సినిమా లో ఛాన్స్ అంటే గొప్ప అవకాశం కానీ నాకు అంతటి శక్తి సామర్ధ్యాలు లేవని అంటోంది . కీర్తి సురేష్ ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ……. జయలలిత బయోపిక్ లో ఎన్నో వివాదాలు ఉన్నాయి రేపు సినిమా విడుదల అయ్యాక ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమో అని సింపుల్ గా ఆ పాత్ర నావల్ల కాదని అంటోంది అంతే !

English Title: keerti suresh sensational comments on jayalalitha biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts