Homeగాసిప్స్సెప్టెంబర్ లోనే మన ముందుకు రానున్న టక్ జగదీష్

సెప్టెంబర్ లోనే మన ముందుకు రానున్న టక్ జగదీష్

సెప్టెంబర్ లోనే మన ముందుకు రానున్న టక్ జగదీష్
సెప్టెంబర్ లోనే మన ముందుకు రానున్న టక్ జగదీష్

న్యాచురల్ స్టార్ నాని నటించిన లాస్ట్ సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే నాని నెక్స్ట్ సినిమా టక్ జగదీష్ మొదట థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నా ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతోంది. అమెజాన్ ప్రైమ్ లోనే ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది.

ఈ విషయం ఇప్పటికే అందరికీ తెల్సింది కానీ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. సెప్టెంబర్ 20న టక్ జగదీష్ ను స్ట్రీమ్ చేయాలని ఓటిటి సంస్థ భావిస్తోంది. అయితే టక్ జగదీష్ టీమ్ అక్టోబర్ లో విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ సంస్థను రిక్వెస్ట్ చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -

శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, నాని అన్న పాత్రలో కనిపించనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All