Homeగాసిప్స్త్రివిక్రమ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాడా?

త్రివిక్రమ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాడా?

త్రివిక్రమ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాడా?
త్రివిక్రమ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని పాటలన్నీ ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో మనం చూసాం. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న జరగనుంది. ఇప్పటివరకూ విడుదలైన నాలుగు పాటలను పెద్ద సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతగా థమన్ అండ్ కో లైవ్ లో ఈ పాటలను పెర్ఫర్మ్ చేయనున్నారు. ఇక సినిమా జనవరి 12న విడుదల అవుతుందని టీమ్ ఎప్పటినుండో చెబుతూ వస్తోన్న విషయం తెల్సిందే.

సాధారణంగా ఏ సినిమా అయినా శుక్రవారం విడుదలవుతుంది. కానీ జనవరి 12 అంటే ఆదివారం. అయినా కానీ అల వైకుంఠపురములో టీమ్ 12కే ఫిక్స్ అయింది. 10వ తేదీ ఖాళీ ఉన్నా కానీ ఆ రోజుకి రావడానికి ఇష్టపడలేదు. దీనికి హారిక అండ్ హాసిని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అజ్ఞాతవాసి సెంటిమెంట్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అజ్ఞాతవాసి 10కే వచ్చి డిజాస్టర్ అయింది. అందుకే 12కి రావాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వచ్చారు.

- Advertisement -

అల వైకుంఠపురములో చిత్రానికి కాంపిటీషన్ గా వస్తోన్న సరిలేరు నీకెవ్వరు కూడా మొదట జనవరి 12కే ఫిక్స్ చేసారు. అయితే మధ్యలో నిర్మాతల గిల్డ్ కలగజేసుకుని దానివల్ల రెండు చిత్రాలకీ నష్టం తప్పదని నచ్చజెప్పడంతో సరిలేరు ఒక రోజు ముందుకు కదిలింది. జనవరి 11న తమ చిత్రం వస్తుందని ప్రకటించుకున్నారు.

అయితే అల వైకుంఠపురములో చిత్ర రఫ్ వెర్షన్ ఇటీవలే చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఔట్పుట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. సంక్రాంతికి ఎంత ముందు వస్తే అంత మంచిది కాబట్టి శుక్రవారం రిలీజ్ వదులుకోకూడదు అని భావిస్తున్నాడట. పైగా సరిలేరు కంటే ఒకరోజు ముందు విడుదలైతే తమకే మంచిదని భావించి ఇప్పుడు జనవరి 10 రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా అయితే 10కి వచ్చి హిట్ కొట్టి సెంటిమెంట్ ను బ్రేక్ చేసినట్టు కూడా ఉంటుందని త్రివిక్రమ్ భావనగా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారట. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All