Homeగాసిప్స్త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?

త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?

త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?
త్రివిక్రమ్ మళ్ళీ అవే సన్నివేశాల్ని తీస్తున్నాడా?

రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతణ్ణి మాటల మాంత్రికుడు అని పిలుస్తారంటేనే ప్రేక్షకుల్లో అతనికున్న ఫాలోయింగ్ గురించి అర్ధం చేసుకోవచ్చు. దర్శకుడు కాకముందు రచయితగా టాప్ స్థానాన్ని అనుభవించాడు త్రివిక్రమ్. తాను రచించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్. రచయితల్లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్నవాడిగా కూడా త్రివిక్రమ్ కు పేరుంది. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక కూడా అతనిలోని రచయితే ఎక్కువ డామినేట్ చేస్తూ వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా సాధించిన విజయాల్లో కూడా సింహభాగం క్రెడిట్ అతనిలోని రచయితకే దక్కుతుంది. అయితే రాను రాను త్రివిక్రమ్ తన సినిమాల విషయంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొన్ని సన్నివేశాల్ని రొటీన్ గా తీస్తాడన్న పేరు కూడా వచ్చింది.

లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలని గమనిస్తే ఒక కామన్ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఎక్ఖవగా ఆఫీస్ సెటప్ ఉన్న సీన్లను తీస్తున్నాడు త్రివిక్రమ్. ఒక సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో ఆఫీస్ సెటప్ ఉంటే, మరొక సినిమాలో ఒక్క సన్నివేశమైనా ఉంటుంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి ఇలా సినిమాల్లో ఆఫీస్ సన్నివేశాలు మాత్రం కచ్చితం. ఇప్పుడు లేటెస్ట్ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో ఆఫీస్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్న విషయం ఇప్పటిదాకా మనకు విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ తో అర్ధమైపోతోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో ఒక ఆఫీస్ కు బాస్ గా కనిపిస్తే ఆమె కింద ఎంప్లొయ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అసలు అల్లు అర్జున్ ఆమె ఆఫీస్ లోకి ఎలా వచ్చాడన్నది కీలకంగా తెలుస్తోంది. ఇక ఇదే ఆఫీస్ సెటప్ లో నవదీప్, రాహుల్ రామకృష్ణ కూడా కనిపించనున్నారు. ఈరోజు విడుదల కాబోయే టీజర్ లో కూడా ఆఫీస్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ టీజర్ లో కూడా అల్లు అర్జున్ టేబుల్ పై నడిచిన సన్నివేశాన్ని పెట్టారు.

- Advertisement -

మరి త్రివిక్రమ్ ఇదేమైనా సెంటిమెంట్ గా కొనసాగిస్తున్నాడా లేక నిజంగానే త్రివిక్రమ్ ఐడియాస్ రొటీన్ అయిపోతున్నాయా అన్నది తెలీదు కానీ ఒకలాంటి సన్నివేశాలే రిపీట్ అవుతున్నాయనేది మాత్రం స్పష్టం. ఇక అల వైకుంఠపురములో విషయానికి వస్తే ఈ చిత్రంలో టబు ముఖ్యపాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. మలయాళ నటుడు జయరాం, సుశాంత్, నివేతా పేతురాజ్, మురళి శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All