Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కోసం డ‌బుల్ బొనాంజా!

ఫ్యాన్స్ కోసం డ‌బుల్ బొనాంజా!

ఫ్యాన్స్ కోసం డ‌బుల్ బొనాంజా!
ఫ్యాన్స్ కోసం డ‌బుల్ బొనాంజా!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్‌ని రెడీ చేస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఇద్ద‌రు ఫ్రీ‌డ‌మ్ ఫైట‌ర్స్ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అల్లూరి సీతారామ‌రాజుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేసి జ‌క్క‌న్న ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే.

ఈ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. త్వ‌ర‌లో ఎన్టీఆర్ పుట్టున రోజున క‌మ‌రం భీం పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం కొంత వీడియో పుటేజ్ అవ‌స‌ర‌మ‌ని రాజ‌మౌళి చెబుతున్నారు. ఇదిలా వుంటే ఎన్టీఆర్ న‌టించ‌నున్న మ‌రో చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని కూడా అదే రోజు రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ న‌టించ‌నున్న 30వ చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, హీరో న‌పంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని ఎన్టీఆర్ పుట్టిన రోజున  చిత్ర బృందం రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తోంది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఒకే రోజు రెండు ట్రీట్‌‌ల‌న్న‌మాట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All