Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఛాలెంజ్‌ని బాల‌య్య అంగీక‌రిస్తారా?

ఎన్టీఆర్ ఛాలెంజ్‌ని బాల‌య్య అంగీక‌రిస్తారా?

ఎన్టీఆర్ ఛాలెంజ్‌ని బాల‌య్య అంగీక‌రిస్తారా?
ఎన్టీఆర్ ఛాలెంజ్‌ని బాల‌య్య అంగీక‌రిస్తారా?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో జోరుగా వైర‌ల్ అవుతున్న ఛాలెంజ్‌ `బీ ద రియ‌ల్ మెన్‌`. సందీప్‌రెడ్డి వంగ మొద‌లుపెట్టిన ఈ  ఛాలెంజ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్స్ నుంచి స్టార్ హీరోస్‌, ప్రొడ్యూస‌ర్స్‌, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ దాకా వెళ్లింది. రామ్‌చ‌ర‌ణ్ కార‌ణంగా బాలీవుడ్‌కి పాకితే.. చిరంజీవి పొలిటిక‌ల్ లీడ‌ర్ కేటీఆర్‌ని నామినేట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్టీఆర్ టాస్క్‌ని కంప్లీట్ చేసి మెగాస్టార్ చిరంజీవిని, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌ని నామినేట్ చేశారు. ఈ న‌లుగురిలో చిరంజీవి గురువారం త‌న‌కిచ్చిన టాస్క్‌ని పూర్తి చేశారు. గ్యాంగ్‌లీడ‌ర్ వీడియో కోసం ఎదురుచూస్తున్నాన‌ని, అది రాగానే త‌న వీడియోని పోస్ట్ చేస్తాని చెప్పిన వెంక‌టేష్ మ‌ధ్యాహ్నం వీడియోని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ నామినేట్ చేసిన వారిలో మిగిలింది బాల‌కృష్ణ‌, నాగార్జున‌.

ఈ టాస్క్‌ని బాల‌య్య కంప్లీట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెల‌కొంది. బాల‌య్య ఛాలెంజ్‌ని అంగీక‌రిస్తారా లేదా అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఓ షెడ్యూల్ కూడా పూర్త‌యింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All