Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు హీరోయిన్‌లా?

ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు హీరోయిన్‌లా?

ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు హీరోయిన్‌లా?
ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు హీరోయిన్‌లా?

మాట‌ల మాంత్రికుడు త‌న ప్ర‌తి చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్‌లు లేకుండా ఏ సినిమా చేయ‌డం లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో చేసిన `అత్తారింటికి దారేది` చిత్రం నుంచి త్రివిక్ర‌మ్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. అత్తారింటికి దారేది`లో స‌మంత‌, ప్ర‌ణీత‌, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో స‌మంత‌, నిత్యామీన‌న్ , అదాశ‌ర్మ‌, అఆలో స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అజ్ఞాత‌వాసిలో కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అర‌వింద స‌మేత‌లో పూజా హెగ్డే, ఈషా రెబ్బా, అల వైకుంఠ‌పుర‌ములో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ .. వుండేలా చూసుకున్న త్ర‌విక్ర‌మ్ ఎన్టీఆర్ చిత్రానికి కూడా ఇద్ద‌రిని సెట్ చేశార‌ట‌.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. పొలిటిక‌ల్ సెటైర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా ఇద్ద‌రు నాయికలు క‌నిపించ‌నున్నార‌ట‌. మెయిన్ హీరోయిన్‌గా బాలీవుడ్ భామ‌ని సంప్ర‌దిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మ‌రో హీరోయిన్‌గా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన భామ వుండే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. స‌మ్మ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌కు కోవిడ్ బ్రేకేసింది. ప‌రిస్థితులు మారితే త‌ప్ప ఈ మూవీ షెడ్యూల్ మొద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All