Homeటాప్ స్టోరీస్ఆ సినిమాని అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారట

ఆ సినిమాని అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారట

Trisha question sun tv play 96 movieతమిళనాట ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం ” 96”. అయితే త్రిషవిజయ్ సేతుపతి జంటగా నటించిన 96 చిత్రాన్నీ అప్పుడే టివిలో వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సన్ నెట్ వర్క్ . అక్టోబర్ 4న విడుదలైన 96 చిత్రం తమిళనాట దిగ్విజయంగా ప్రదర్శితమౌతోంది . దాంతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు హక్కులు కొనుక్కున్నారు . సినిమా మంచి విజయం సాధించింది అని సంతోష పడుతున్న సమయంలో ఈ దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని 96 చిత్రాన్ని బుల్లితెరపై ప్రీమియర్ షో వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . సినిమా విడుదలైన నెల రోజులకే వెంటనే టీవీలో వేయడం ఏంటి ? వద్దు అని హెచ్చరికలు జారీ చేస్తోంది త్రిష .

చాలారోజుల తర్వాత త్రిష కు 96 రూపంలో మంచి హిట్ లభించింది దాంతో ఆ చిత్రాన్ని కిల్ చేయకండి . ఇంకా థియేటర్ లలో జనాలు సినిమా చూస్తున్నారు కావాలంటే సంక్రాంతి కి వేసుకోండి అంటూ ట్వీట్ చేసింది త్రిష . అయితే 96 చిత్ర శాటిలైట్ హక్కులు కొనుక్కున్న సన్ నెట్ వర్క్ త్రిష మాటలు వినేలా కనిపించడం లేదు . ఆల్రెడీ ప్రోమో కూడా వేశారు దీపావళి కి 96 చిత్ర ప్రీమియర్ షో పడుతుందని .

- Advertisement -

English Title: Trisha question sun tv play 96 movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All