
`నీ మనసు నాకు తెలుసు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది చెన్నై సోయగం త్రిష. `వర్షం`తో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. గత 22 ఏళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నాయికగా తనదైన ముద్ర వేసిన త్రిష పుట్టిన రోజు నేడు. ఈ ఏడాదితో ఆమె 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. కరోనా కారణంగా ఎలాంటి హడావిడీ లేకుండా చెన్నైలోని తన నివాసంలో పుట్టిన రోజు వేడుకల్ని త్రిష చాలా నిడారంబరంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా ఆమె వయసుతో పాటు ఆమె పెళ్లిపై కూడా చర్చ మొదలైంది. 38లోకి ఎంటరైన త్రిష ఇంత వరకు తన పెళ్లికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో వరుణ్ మానియన్‌ని వివాహం చేసుకోవాలనుకుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.
ఆ తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి త్రిష పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి. ఇటీవల ఆమె శింబుని వివాహం చేసుకోనుందని వార్తలు జోరందుకున్నాయి. ఆ తరువాత ఓ యువ వ్యాపార వేత్తని ఆమె వివాహం చేసుకోబోందంటూ ప్రచారం జరిగింది. త్రిష మాత్రం మౌనంగానే వుంటోంది. ఇంతకీ త్రిష వివాహం చేసుకుంటుందా? .. ఇన్నేళ్లొచ్చినా పెళ్లి మాట ఎత్తదే అంటున్నారు ఆమె అభిమానులు.