Homeటాప్ స్టోరీస్ఈ సంక్రాంతి 2017 సంక్రాంతిని తలపించబోతోందా?

ఈ సంక్రాంతి 2017 సంక్రాంతిని తలపించబోతోందా?

ఈ సంక్రాంతి 2017 సంక్రాంతిని తలపించబోతోందా?
ఈ సంక్రాంతి 2017 సంక్రాంతిని తలపించబోతోందా?

సంక్రాంతి అనగానే సినిమాల పండగ. ఈ సీజన్ లో మూడు నుండి నాలుగు సినిమాల దాకా ప్రతి ఏడూ విడుదలవుతుంటాయి. అయితే విడుదలైన అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని లేదుగా. గతేడాది సంక్రాంతికి కూడా మూడు సినిమాలు విడుదలవ్వగా ఎఫ్ 2 ఒక్కటే హిట్ అయింది. మిగిలిన రెండు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చాయి. అలాగే 2018 సంక్రాంతి తీసుకుంటే నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా హిట్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి దారుణమైన పరాజయాన్ని అందుకుంటే రంగుల రాట్నం చిత్రం సోదిలో లేకుండా పోయింది. కంటెంట్ వీక్ గా ఉన్నా పోటీ లేకపోవడంతో జై సింహా విజయం సాధించింది. అయితే 2017 సంక్రాంతి ఇందుకు పూర్తిగా భిన్నం. టాలీవుడ్ కు మరుపురాని ఆరంభాన్ని ఇచ్చింది ఆ ఏడు సంక్రాంతి సీజన్.

2017 సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడం విశేషం. ఆ సీజన్ టాలీవుడ్ మొత్తం కళకళలాడింది. బయ్యర్లు పండగ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత 2 సంవత్సరాలు పెద్దగా సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది లేదు. కానీ ఈ ఏడాది పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమా విడుదలవుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాలు విడుదలైపోయాయి. దర్బార్ కు యావరేజ్ టాక్ రాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక జనవరి 12న విడుదల కానున్న అల వైకుంఠపురములో, 15న రానున్న ఎంత మంచివాడవురా చిత్రాలు కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు సెన్సార్ టాక్ కూడా అదిరిపోయిందనే రేంజ్ లోనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు అన్నీ విజయాలు సాధిస్తాయన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 2017 సంక్రాంతి తరహాలో అన్ని సినిమాలు బాగా ఆడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All