Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో ట్రైలర్ రివ్యూ: క్లాస్ త్రివిక్రమ్ కు మాస్ బన్నీ తోడు

అల వైకుంఠపురములో ట్రైలర్ రివ్యూ: క్లాస్ త్రివిక్రమ్ కు మాస్ బన్నీ తోడు

అల వైకుంఠపురములో ట్రైలర్ రివ్యూ: క్లాస్ త్రివిక్రమ్ కు మాస్ బన్నీ తోడు
అల వైకుంఠపురములో ట్రైలర్ రివ్యూ: క్లాస్ త్రివిక్రమ్ కు మాస్ బన్నీ తోడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ట్రైలర్ నిన్న జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ లో భాగంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి నుండి భారీ అంచనాలని నెలకొల్పుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ఆల్బమ్ లోని పాటలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామజవరగమన, రాములో రాముల సాంగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో హిట్స్ అయ్యాయి. దీంతో లిరిక్ రైటర్స్ ను, సింగర్స్ ను, వాయిద్య కళాకారులను గుర్తించడానికి నిన్న మ్యూజికల్ కన్సర్ట్ ను నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైలర్ విడుదల కూడా జరిగింది.

ఇక ట్రైలర్ ను చూస్తే త్రివిక్రమ్ స్టైల్ లోనే సాగింది. చాలా క్లాస్ గా తనదైన శైలిలోని డైలాగ్స్ తో త్రివిక్రమ్ ఈ ట్రైలర్ ను కట్ చేయించాడు. అయితే ట్రైలర్ లో కూడా కథ ఏంటనేది పెద్దగా రివీల్ చేయకపోవడం విశేషం. పెద్దింటి కలలు కనే మిడిల్ క్లాస్ కుర్రాడిగా, తండ్రి మీద ఫ్రస్ట్రేషన్ తో నలిగిపోయే కొడుకుగా అల్లు అర్జున్ పాత్ర కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో ముందుగా ఆకట్టుకునేది డైలాగులే. మాటల మాంత్రికుడు మరోసారి తన కాలానికి పదును పెట్టాడు.

- Advertisement -

“నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది”

“దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సర్, ఒకటి నేలకి, రెండోది వాళ్ళకి.. అలాంటోళ్ళతో మనకి గొడవేంటి సర్, జస్ట్ సరెండర్ అయిపోవాలంతే”

“గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే”

వంటి డైలాగులు చాలా క్యాచీగా ఉంటూనే అలరిస్తాయి. ఇక బన్నీ కూడా ట్రైలర్ లో అదరగొట్టేసాడు. ఫైట్స్, కామెడీ, పంచ్ డైలాగ్స్ తో తన పాత్రలో బోలెడన్ని వేరియేషన్స్ ఉన్నట్లు చూపించాడు. ట్రైలర్ లో పాత్రల పరిచయాలు అన్నీ జరిగాయి. హర్షవర్ధన్, సునీల్ ల కామెడీ హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించింది. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అల వైకుంఠపురములో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All