
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పలు భాషల్లో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది.
టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు రోజులు భారీగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ సోమవారం నుండి తగ్గడం స్టార్ట్ అయ్యింది. ఈ తరుణంలో సినిమా కు బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. అందులో భాగంగా ‘రాధేశ్యామ్’ నుంచి హృద్యమైన మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘ది సోల్ ఆఫ్ రాధేశ్యామ్’గా వచ్చిన వీడియోలోని సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.