
శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్న ఈ భామ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 10 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమాలోని ‘పంచెకట్టు’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.
ఈ సాంగ్ కు వివేక్ సాగర్ ట్యూన్ కంపోజ్ చేయగా , హసిత్ గోలీ లిరిక్స్ అందించారు. లెజెండరీ కర్ణాటిక్ క్లాసికల్ గాయని అరుణా సాయిరామ్ ఈ పాటని ఆలపించడం విశేషం. ఈ పాటలో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తో సహా అమెరికాలోని పాపులర్ ప్రదేశాల చుట్టూ తిరుగుతూ కనిపించాడు నాని. ఇక మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.