
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, లెజండరీ పర్సనాలిటీ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ తలైవి సెప్టెంబర్ 10న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన సంగతి తెల్సిందే. కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషించగా అరవింద్ స్వామి ఎంజీఆర్ రోల్ ను పోషించాడు. ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.
తలైవి తమిళనాడులో మంచి రేటింగ్స్ ను సాధించింది. క్రిటిక్స్ ఈ చిత్రానికి హిట్ రేటింగ్స్ ఇచ్చారు. హిందీలో, తెలుగులో యావరేజ్ రేటింగులు సాధించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ ప్లాప్ గా నిలిచింది. తెలుగులో సీటిమార్ పోటీని తలైవి తట్టుకోలేకపోయింది. హిందీ మార్కెట్స్ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వని నేపథ్యంలో తలైవి అక్కడ డిజాస్టర్ ముద్రను వేయించుకుంది.
తమిళనాడులో కలెక్షన్స్ కొంచెం బెటర్ గా ఉన్నా కానీ కనీసం యావరేజ్ అనిపించే రేంజ్ కు కూడా ఈ చిత్రం చేరే అవకాశం లేదని తేల్చేసారు. మొత్తానికి తలైవి కంగనా రనౌత్ కెరీర్ లో మరో భారీ ప్లాప్ గా నిలిచింది.