Homeటాప్ స్టోరీస్“తలైవా ఆన్ డిస్కవరీ” – బేర్ గ్రిల్స్ తో పోటీ పడిన రజనీ

“తలైవా ఆన్ డిస్కవరీ” – బేర్ గ్రిల్స్ తో పోటీ పడిన రజనీ

“తలైవా ఆన్ డిస్కవరీ” – బేర్ గ్రిల్స్ తో పోటీ పడిన రజనీ
“తలైవా ఆన్ డిస్కవరీ” – బేర్ గ్రిల్స్ తో పోటీ పడిన రజనీ ( Pic Credit : DiscoveryChannelInd )

మనిషికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది.?  మంచి ఆహారం, నచ్చిన పని, మెచ్చిన మనిషి సాంగత్యం, మనమంటే ప్రాణాలిచ్చే జనం, ఇవన్నీ కూడా దాటేసి ఆయన నేరుగా ఆధ్యాత్మిక శక్తి తో పని చేస్తున్నాడు. పరుగులు తీస్తున్నాడు. మనకి సవాల్ విసురుతున్నాడు. ఆ శక్తి పేరు శివాజీ రావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్. నిన్న కాక మొన్నే కదా..! దర్బార్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఫిజికల్ టెస్ట్ కోసం మళ్ళీ తెరపై కండలు చూపించిన 70 ఏళ్ళ దేవుడు మళ్ళీ… ఇప్పుడు డిస్కవరీ ఛానల్ లో “బేర్ గ్రిల్స్” ప్రోగ్రాం కోసం కొండలు,గుట్టలు ఎక్కుతూ, నదులు దాటుతూ, అడవిలో ఒక సింహం ఎంత సుఖంగా, సౌకర్యవంతంగా తిరుగుతుందో, అలా తిరిగేస్తున్నాడు.

ఇప్పటివరకూ బేర్ గ్రిల్స్ ఎంతో మంది అతిధులను ఈ ప్రోగ్రామ్ లో చూపించాడు. సాక్షాత్తూ దేశ ప్రధాని కూడా బేర్ గ్రిల్స్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. కానీ తలైవర్ క్రేజ్ ఎవ్వరికీ రాలేదు. అందుకే డిస్కవరీ వాళ్ళు కూడా ప్రోమోల మీద ప్రోమోలు వదులుతూ బిజినెస్ గట్టిగా చేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో బేర్ గ్రిల్స్ తోపాటు సమానంగా తలైవర్ ఎంట్రీ తరువాత డైరెక్ట్ గా “ఆయన ఎదుర్కొన్న కష్టాలతో పోలిస్తే, ఇది పెద్ద కష్టం కాదు” అని నేరుగా బేర్ గ్రిల్స్ అంటున్నాడు.

- Advertisement -

రజనీ జీప్ నడిపే స్పీడ్ చూసి, “గురూజీ…. ప్లీజ్… స్లో..!” అని రిక్వెస్ట్ చేసాడు బేర్ గ్రిల్స్. రజనీ కొండ ఎక్కే స్టైల్ చూసి, “మీరు నిజంగానే సూపర్ హీరో సార్..!” అని దణ్ణం పెట్టేసాడు. ఖాళీగా ఉన్న ఒక వంతెనని కూడా రజనీ.. బేర్ గ్రిల్స్ తోపాటు సమానంగా ఎక్కేసాడు. లాస్ట్ షాట్ లో రజనీ కళ్ళజోడు పెట్టుకునే సిగ్నేచర్ షాట్ చూపించి ప్రోమో ఎండ్ చేసాడు. ఈ సీరీస్ రిలీజ్ అయితే డిస్కవరీ, బేర్ గ్రిల్స్ ఫ్యాన్ అందరూ కూడా రజనీ కాంత్ ఫ్యాన్స్ అయిపోతారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All