Wednesday, October 5, 2022
Homeన్యూస్కేసీఆర్ ప్రకటన తో సంబరాలు చేసుకుంటున్న నిరుద్యోగులు

కేసీఆర్ ప్రకటన తో సంబరాలు చేసుకుంటున్న నిరుద్యోగులు

kcr announced on government job notification
kcr announced on government job notification

సీఎం కేసీఆర్ చెప్పినట్లు నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించారు. మొత్తం 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసి ఆనందం నింపారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన తో ఉస్మానియా యూనివర్సిటీ లో టీఆర్ఎస్వీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటో కి పాలాభిషేకం చేశారు. మరోపక్క తెలంగాణ భవన్ లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ‘నిరుద్యోగ బంధు కేసీఆర్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేస్తున్నారు.

80,039 పోస్టుల భర్తీకి సంబదించిన వివరాలు, ఖాళీలు ఇలా ఉన్నాయి.

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు
గ్రూప్‌ 3 – 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు చూస్తే..

జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే..

హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల చూస్తే..

జోన్‌లలో18,866 ఖాళీలు,
మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు చూస్తే..

కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు చూస్తే..

మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370

ఏ శాఖలో ఎన్నిఅనేవి చూస్తే..

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని తెలిపారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలు చూస్తే..

హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts