Homeటాప్ స్టోరీస్థియేట‌ర్ల పునః ప్రారంభానికి రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌!

థియేట‌ర్ల పునః ప్రారంభానికి రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌!

థియేట‌ర్ల పునః ప్రారంభానికి రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌!
థియేట‌ర్ల పునః ప్రారంభానికి రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌!

లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త మార్చి నుంచి థియేట‌ర్లు మూసి వేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం థియేట‌ర్ల పునః ప్రారంభానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేట‌ర్లు తెర‌వొచ్చ‌ని తెలిపింది. అయితే సినిమాహాల్లల్లో ప్ర‌తీ వ్య‌క్తీ మాస్క్‌ని త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌ర‌ని ఆదేశించింది. అలాగే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు వుండేలా చూసుకోవాల‌ని తెలిసింది.

భౌతిక దూరం, గుంపులు గుంపులుగా తిర‌గ‌డం నిషేధం. ప్ర‌తి షో ముందు కామ‌న్ ఏరియాలో సానిటైజేష‌న్ చేయాలి అని.. రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. తాజా ఉత్త‌ర్వులు వెంట‌నే అమ‌ల్లోకి రానున్నాయి. ఈ సంద‌ర్భంగా సినీ థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు ప‌లు వెసులుబాట్లు క‌ల్పించారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క  త‌ర‌హాలో టిక్కెట్‌ల ధ‌ర‌ల్ని స‌వ‌రించుకునే వెసులుబాటు క‌ల్పిస్తామ‌ని, టిక్కెట్ ధ‌ర పెంచుకోవ‌చ్చ‌ని, సీఎం కేసీఆర్ వివ‌రించారు.

- Advertisement -

ఇక 10 కోట్ల లోపు బ‌డ్జెట్ చిత్రాల‌కు ఎస్ జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ తో సాహాయం చేస్తామ‌న్నారు. థియేట‌ర్లు ఎప్పుడైనా తెరుచుకోవ‌చ్చ‌ని, ఈ విష‌యంలో నిర్ణ‌యాధికారం సినీ ప‌రిశ్ర‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని థియేట‌ర్ల‌లో అధిక షోలు పెంచుకునేందుకు అనుమ‌తిస్తామ‌న్నారు.

సీఎం కేసీఆర్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌లు…

క‌రోనాతో కుదేలైన సినిమా రంగానికి వ‌రాల జ‌ల్లును కురిపించిన సీఎం కేసీఆర్ గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలుసుకుంటున్నాను అన్నార మెగాస్టార్ చిరంజీవి. చిన్న సినిమాల‌కు రాష్ట్ర జీఎస్టీ రీఎంబ‌ర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేట‌ర్ల‌కు విద్యుత్ క‌నీస డిమాండ్ ఛార్జీల ర‌ద్దు, రాష్ట్రం లోని అన్ని సినిమా థియేట‌ర్ల‌లో షోల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి… ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలో టిక్కెట్‌ల రేట్లు పెంచుకునే వెసులుబాటు వంటి చ‌ర్య‌లు ఈ స‌మ‌యంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది కుటుంబాల‌కి ఎంతో తోడ్పాటుగా వుంటాయి. కేసీఆర్‌గారి నేతృత్వంలో ఆయ‌న విజ‌న్‌కి  త‌గ్గ‌ట్టుగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి  సాధించి దేశంలోనే మొద‌టి స్థానాన్ని పొందుతుంద‌న్న పైర్తి విశ్వాసం మాకుంది` అన్నారు మెగాస్టార్‌. ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All