Homeటాప్ స్టోరీస్ముంబై హీరోయిన్లపై ఘాటు కామెంట్లు చేసిన ఐస్ క్రీమ్ పాప

ముంబై హీరోయిన్లపై ఘాటు కామెంట్లు చేసిన ఐస్ క్రీమ్ పాప

  ముంబై హీరోయిన్లపై ఘాటు కామెంట్లు చేసిన ఐస్ క్రీమ్ పాప
ముంబై హీరోయిన్లపై ఘాటు కామెంట్లు చేసిన ఐస్ క్రీమ్ పాప

ఐస్ క్రీమ్ సినిమాతో బోల్డ్ ఇమేజ్ సంపాదించుకుంది తేజస్వి. మొదట సపోర్టింగ్ పాత్రలకు పరిమితమైన తేజస్వి క్రమంగా బోల్డ్ రోల్స్ వైపు చూసింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ చిత్రంతో తనలోని బోల్డ్ యాంగిల్ ను పూర్తిగా చూపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్, ఓటిటి కంటెంట్, సినిమాలు అంటూ వివిధ రకాల ప్లాట్ ఫామ్స్ లో నటిస్తోన్న తేజస్వి లేటెస్ట్ గా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ఇండస్ట్రీలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని నిర్మొహమాటంగా తెలిపింది తేజస్వి. నాకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. చాలా మంది నన్ను ఓపెన్ గానే అడిగారు. అసలు ఎవరైనా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కమిట్మెంట్లు అడుగుతుంటారు.

వాళ్ళను దాటుకుని వెళితేనే అసలైన సినిమా వాళ్ళు మనకు ఎదురవుతారు. అయితే కమిట్మెంట్ ఇవ్వడానికి నో చెబితే రోల్స్ కూడా మనకు దక్కకుండా చేస్తారు. మరోవైపు ముంబై నుండి వచ్చే హీరోయిన్లు అన్ని రకాలుగా సిద్ధమై వస్తుంటారు. వారు ఓపెన్ గానే ఉంటారు. కమిట్మెంట్లకు సిద్ధంగా ఉంటారు. వారి వల్ల తెలుగు అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తోందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది.

- Advertisement -

ఇక తనకు కాస్టింగ్ కౌచ్ వల్ల వ్యక్తిగత జీవితం కూడా బాగా డిస్టర్బ్ అయినట్లు తెలిపింది. నా రిలేషన్ షిప్ ను కూడా నాశనం చేసింది ఈ కాస్టింగ్ కౌచ్ అని తెలిపింది తేజస్వి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All