Homeటాప్ స్టోరీస్తేజస్వి సామ్రాట్ ని పెళ్లి చేసుకోబోతోందా

తేజస్వి సామ్రాట్ ని పెళ్లి చేసుకోబోతోందా

marriage rumours on tejaswi and samratసినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే తేజస్వి నటుడు సామ్రాట్ ని పెళ్లి చేసుకోబోతోందా ? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు . సోషల్ మీడియాలో అదేపనిగా కొంతమంది సామ్రాట్ తేజస్వి ల పెళ్లి గురించిన టాపిక్ లను వైరల్ అయ్యేలా చేస్తున్నారు . ఇంతగా నెటిజన్లు తేజస్వి – సామ్రాట్ ల పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా …… ….. బిగ్ బాస్ 2 . అవును బిగ్ బాస్ 2 లో ఈ ఇద్దరూ పాల్గొన్నారు పైగా ఈ ఇద్దరూ రకరకాల విషయాల పట్ల ఓకే అభిప్రాయం కలిగి ఉండటంతో ఇద్దరి మనసులు దగ్గరయ్యాయి .

అంతేకాదు ఈ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు , అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అలాగే ఉండటంతో ఇక వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడమే తరువాయి అని గుసగుసలు మొదలయ్యాయి . అయితే ఈ విషయం తేజస్వి చెవిన పడటంతో ఘొల్లున నవ్వుతోంది . సామ్రాట్ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునేంత కాదని , మా ఇద్దరి మనసులు కలిశాయని అందుకే మీ ఇద్దరి పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతున్నారని కానీ మేము కేవలం స్నేహితులం మాత్రమే అని అంటోంది పరమ రొటీన్ గా . ఆల్రెడీ సామ్రాట్ కు పెళ్లి అయ్యింది కానీ సంచలన ఆరోపణలు చేస్తూ అతడి భార్య మీడియా ముందుకు వచ్చింది , ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది .

- Advertisement -

English Title: marriage rumours on tejaswi and samrat

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All