Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ క్రేజే వేరు

విజయ్ దేవరకొండ క్రేజే వేరు

Taxiwala buyers gets profitsయంగ్ హీరో విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ మాములు విషయం కాదు . ఈతరంలో ఏ హీరోకు అందని క్రేజ్ విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నాడు . టాక్సీ వాలా రిలీజ్ కావడమే గొప్ప అనుకుంటే , యావరేజ్ చిత్రంగా ఉన్న టాక్సీ వాలా చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది అంతేకాదు మూడు రోజుల్లోనే 9 కోట్లకు పైగా షేర్ రావడంతో నిర్మాతలతో పాటుగా బయ్యర్లు కూడా లాభాల బాటలోకి వచ్చేసారు . కేవలం మూడు రోజుల్లోనే విజయ్ కున్న క్రేజ్ తో పెట్టినపెట్టుబడి తెచ్చేసుకున్నారు . ఇక మిగిలినదంతా లాభాలే ! ఆల్రెడీ డిజిటల్ రైట్స్ , శాటిలైట్ ల రూపంలో డబ్బులు వచ్చాయి , ఇక ఇప్పుడేమో థియేటర్ ల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి .

ఈ సినిమా ముందే లీక్ కావడంతో సినిమా విజయం పై అంతగా నమ్మకం లేకుండే కానీ దాన్ని రివర్స్ చేస్తూ మంచి విజయం సాధించడమే కాకుండా వసూళ్లు కూడా ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది . నోటా చిత్రంతో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ కు టాక్సీ వాలా సేద తీరేలా చేసాడు . టాక్సీ వాలా కు మంచి సమయం కూడా కలిసి వచ్చింది . అమర్ అక్బర్ ఆంటోనీ ప్లాప్ అవ్వడం , 2. 0 చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అప్పటి వరకు టాక్సీ వాలా చిత్రానిదే హవా !

- Advertisement -

English Title: Taxiwala buyers gets profits

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All