Homeటాప్ స్టోరీస్“వంగవీటి” గా సురేష్ కొండేటి

“వంగవీటి” గా సురేష్ కొండేటి

“వంగవీటి” గా సురేష్ కొండేటి
“వంగవీటి” గా సురేష్ కొండేటి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ – గుంటూరు రౌడీ ఇజం – రాజకీయ అంశాల గురించి ఇప్పటికీ జనాలు కథలు కథలు గా చెప్పుకుంటారు. ఎవరి వెర్షన్ లో వాళ్ళు  తమకు నచ్చిన వాళ్ళను హీరోలు గా , నచ్చని వాళ్ళను విలన్స్ గా చూపిస్తారు. అలా విజయవాడ లో అప్పటి పరిస్థితులు ఆధారంగా మరొక సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు “దేవినేని”. కొన్ని చిన్న సినిమాలు దర్శకత్వం వహించిన శివనాగు ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. ఇక టైటిల్ క్యారెక్టర్ అయినటువంటి దేవినేని రాజశేఖర్ గారి (నెహ్రు) పాత్రలో నందమూరి తారకరత్న మరియు వంగవీటి రంగా గారి పాత్రలో ప్రముఖ సినిమా P.R.O సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రామూ రాథోడ్ ; జి.ఎస్.ఆర్. చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విజయవాడలో ఒకానొక సమయంలో రంగా & నెహ్రు గారు స్నేహితులుగా ఉండేవారు. తర్వాత వ్యాపార పరంగా, రాజకీయపరంగా ఎవరి దారి వారిది అయింది. ఈ మధ్యలో కొంతమంది స్వార్ధపరులు సంబంధం లేని విషయాలను వాళ్ళిద్దరికీ ఆపాదించి, శత్రుత్వం ఉన్నట్లు క్రియేట్ చేసారు. ఇక  ఆ తరవాత అనేక విషయాలు జరిగాయి. వాటికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సినిమాలు వచ్చాయి.

- Advertisement -

గతంలో రామ్ గోపాల వర్మ “వంగవీటి” అనే సినిమా తీసారు. అయితే ఈ సినిమా ఏకపక్షంగా ఉందని, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసారు. మరి త్వరలో రాబోయే ఈ “దేవినేని” సినిమాలో వాటికి సమాధానాలు దొరకాలని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All