Homeగాసిప్స్అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కథ అదేనా.?

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కథ అదేనా.?

RGV’s amma rajyamlo kadapa biddalu story leaked.?
RGV’s amma rajyamlo kadapa biddalu story leaked.?

ఈ ప్రపంచంలో తుఫానులు,భూకంపాల తో మొదలు పెడితే మనుషులకు దెయ్యాలకు చివరికి దేవుడు కి కూడా భయపడకుండా బతికే ఏకైక జీవి R.G.V; బయటకి జనాలందరూ బూతులు తిడుతున్న కానీ, లోపల మాత్రం ఆడు మగాడ్రా బుజ్జీ..! అని ఆనంద పడుతూ ఉంటారు. దానికి కారణం మామూలు మనుషులు చిరాకు లో ఉన్నప్పుడు, ఉన్నప్పుడు లేదా మందు కొట్టినప్పుడు మాట్లాడుకొని ఫీల్ అయ్యే విషయాలను ఆయన నేరుగా ప్రస్తావించి సినిమాలలో కూడా చూపిస్తాడు. తీసే ప్రతి సినిమాలో నిజమైన జీవితానికి సంబంధించిన క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు అక్కడ ఆ నిమిషంలో ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో అలానే చూపిస్తాడు. ఇప్పుడు ఏదో కొత్తగా రామ్ గోపాల్ వర్మ రాజకీయ నాయకుల బయోపిక్ లు అంటూ మొదలు పెట్టలేదు. తన మొట్టమొదటి సినిమా శివ లోనే విలన్ పేరు భవాని అనే పేరుకి ఇన్స్పిరేషన్ గా అప్పట్లో విజయవాడలో సంచలనం సృష్టించిన పెద్ద రాధా గారి పేరును వాడుకున్నాడు. అదే శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ చనిపోయే సీన్ కి ఇన్స్పిరేషన్, ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ గారి తమ్ముడు దేవినేని మురళి హత్య ఉదంతమే. ఎలా అయితే…, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో ఆయన హత్య జరిగినప్పుడు నిందితులు ఆయన్ని వెంటాడి చంపారో ఆ సన్నివేశం కూడా అలాగే ఉందని అప్పట్లో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అన్నట్లు వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత స్టార్ లన్ని నమ్ముకోకుండా కేవలం సినిమాకి పనిచేసిన టెక్నిషియన్ లకి మాత్రమే గుర్తింపు రావాలి అన్న లక్ష్యంతో క్రైమ్, మాఫియా, హర్రర్, టెర్రరిజం, బ్లాక్ మ్యాజిక్ ఇలా ప్రతి జోనర్ లోనూ సినిమాలు చేశాడు. జనాలు గుంపులు గుంపులుగా కూర్చుని గుసగుసలు గా మాట్లాడుకునే రాయలసీమ ఫ్యాక్షన్ కథలను రక్తచరిత్ర రూపంలో తీసి చూపించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమాలలో కూడా, యదార్థంగా జరిగిన సంఘటనలను చూపించాడు. తాజాగా ఇప్పుడు “అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు” గా టైటిల్ మార్చుకున్న సినిమాలో ఆయన చెప్పే కథను ఇదేనని కొంతమంది సినీ లవర్స్ అంటున్నారు.

సినిమా మొదలెడితే, మొత్తం 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన బాబు గారు ఆయన పార్టీ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. ఓటమి తర్వాత బాబు గారి భజన చేసే రాజకీయ నాయకులు ఒక బ్యాచ్ గా బాబు గారిని భరించలేని నాయకులు ఇంకొక బ్యాచ్ గా విడిపోతారు. ఇలా విడిపోయిన వాళ్ళు అధికార పార్టీలో కి వెళ్దాం అంటే..? అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఆయన పార్టీ లోకి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లక తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో గతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి తన పిల్లనిచ్చిన మామను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడో..? అలానే శాంతిభద్రతల సమస్యలు సృష్టించి రాష్ట్రంలో అల్లకల్లోలం రేపడానికి పూనుకుంటాడు ఓడిపోయిన బాబు గారు.

- Advertisement -

కేసుల విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం నాయకులు ఈ విషయంలో బాబుతో డబల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఒకపక్క బాబుకి తాను ఓటుకు నోటు కేసులో జైల్లో కి వెళ్తాం అన్న భయం కూడా పట్టుకుంటుంది. మరోవైపు “పండిత పుత్ర పరమ శుంఠ” అన్న చందాన ఏ మాత్రం ప్రభావం చూపించలేదని తన కొడుకు పప్పుని చూసుకొని కుమిలిపోతూనే ఉంటాడు. ఇంత సీరియస్ రాజకీయాలలో కూడా, మేం కూడా ఉన్నావంటూ ఒక మత ప్రచారం చేసుకునే వ్యక్తి మరియు రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికలలో బాబు గారికి పరోక్షంగా సహాయపడిన ఒక సినిమా హీరో తమ వంతు కామెడీ చేసి రాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో,

· కష్టపడి పాదయాత్ర చేసి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన ఆ ముఖ్యమంత్రి ఎలా పరిస్థితులను అదుపులోకి తెచ్చాడు.?

· బాబు గారికి రాజకీయ జీవితం చివరి రోజుల్లో అయినా గాని జ్ఞానోదయం అయ్యిందా.?

· ఆయన వంశోద్ధారకుడు తో పాటుగా మిగిలిన రెండు కామెడీ పీస్ లు అయినటువంటి రాజకీయ నాయకులు ఏం చేశారు.?

· తమ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతం గా ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్న ఆ కేంద్ర ప్రభుత్వ పార్టీ ఏం చేసింది.?

ఇదే మిగిలిన సినిమా కథ.

ఇక సినిమాలో చెప్పుకున్నట్లుగా ఆ బాబుగారి నిజజీవిత రాజకీయ శత్రువుల అందరూ పరోక్షంగా ఈ సినిమా ని సపోర్ట్ చేసి విడుదల అవ్వడానికి సహకరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All