Homeటాప్ స్టోరీస్చరిత్ర మరిచిన మహా యోధుడు – సుబేదార్ తానాజీ

చరిత్ర మరిచిన మహా యోధుడు – సుబేదార్ తానాజీ

చరిత్ర మరిచిన మహా యోధుడు – సుబేదార్ తానాజీ
చరిత్ర మరిచిన మహా యోధుడు – సుబేదార్ తానాజీ

ఒక యుద్ధం గురించి తెలుసుకోవాలి అంటే కేవలం గెలిచినా వాళ్ళు, ఓడిపోయిన వాళ్ల గురించి మాత్రమే మాత్రమే కాదు; ఆ యుద్ధాన్ని గెలిచేలా చేసిన యోధుల గురించి కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే సైన్యం, ఆయుధాలు సమృద్ధిగా ఉంటె ఎవరైనా అడుగు ముందుకు వేస్తారు. కానీ తక్కువ సైన్యంతో అసలు ప్రవేశించడం కూడా వీలు కాని కోటను అది కూడా వేలమంది సైన్యంతో పోరాడి, గెలిచి అమరుడైన ఒక మహాయోధుడి కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వీరుడే సుబేదార్ తానాజీ మాల్సారి. అతను జయించి ఇచ్చినది కొండానా కోట.
• అసలు తానాజీ ఎవరు.?
• శివాజీ దగ్గర అంతమంది దళపతులు ఉండగా ఎందుకు కొండానా కోట గెలిపించే భాద్యత తానాజీకి ఇచ్చాడు.?
• కొండానా కోట ప్రత్యేకత ఏంటి.?
• శివాజీ, తానాజీలను లను ఎదుర్కోడానికి ఔరంగజేబ్ వేసిన ఎత్తుగడ ఏంటి.?
• చత్రపతి శివాజీ తల్లికి తానాజీ ఇచ్చిన మాట ఏంటి.?
• సొంత కొడుకు పెళ్లి కూడా వాయిదా వేసుకుని తానాజీ ఎందుకు యుద్దానికి వెళ్ళాడు.?
• కేవలం 500 సైనికులతో 5000 మంది సైన్యం ఉన్న కొండానా కోటను తానాజీ ఎలా జయించాడు .?
• S.S రాజమౌళి చేసిన మగధీర సినిమాకు తానాజీ కథకు సంబంధం ఏంటి.?
భారతదేశ చరిత్రలో ఎన్నో గెరిల్లా యుద్దాలకు స్ఫూర్తి గా నిలిచి ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్ గా ట్రెండ్ అవుతున్న ఆ యుద్ధం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరివరకూ చూడండి.

ప్రపంచం అయినా, చరిత్ర అయినా, ఎక్కువగా గుర్తు పెట్టుకునేది విజేతలను; వారి గెలుపును. కానీ భావి తరాలకు స్ఫూర్తి ఇచ్చేది మరియు ఎప్పుడు చరిత్ర గతిని మలుపు తిప్పగలిగే సత్తా నిస్వార్ధంగా త్యాగం చేసిన మహనీయుల వల్లే సాధ్యం అవుతుంది. అలా చరిత్ర పుటల్లో ఇప్పటిదాకా అంతగా ప్రాధాన్యత పొందని మరాఠా అమర వీరుడు సుబేదార్ తానాజీ మాల్సారి. తానాజీ చత్రపతి శివాజీ సైన్యంలో అతి ముఖ్యమైన వ్యక్తి.

- Advertisement -

మోసపూరితంగా అఫ్జల్ ఖాన్ శివాజీ ని చంపడానికి ప్రయత్నించినప్పుడు అఫ్జల్ పై ప్రతిదాడి చేసిన వ్యక్తి తానాజీ. ఛత్రపతి శివాజీ తన రాజ్యాన్ని హిందూ స్వరాజ్యంగా ప్రకటించిన తరువాత ఔరంగజేబుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తన స్వాధీనంలోని కోటలను మొఘల్స్ కి తిరిగి అప్పగించాడు. అయితే ఔరంగజేబు శివాజీకి నమ్మకద్రోహం చేసి ఆయనను ఆగ్రా కోటలో బంధించాడు. ఆగ్రా కోట నుంచి తప్పించుకున్న శివాజీ తిరిగి ఆ కోటలన్నింటిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. జయించిన వాటిలో పురందర్, రోహిడ, లోహగడ, మాహులీ, కొండాణ కోటలు ముఖ్యమైనవి.

చరిత్ర పుటలలో అన్నిటికన్నా వీర్ తానాజీ కొండానా కోటను స్వాధీనం చేసుకున్నకథ ప్రపంచ యుద్ధ గాధలలో స్వర్ణాక్షరాలతో లిఖించ తగ్గది. కొండాణ దుర్గాన్ని జయించడానికి ఛత్రపతి శివాజీ తానాజీ నిఎంపిక చేశారు. శివాజీ లక్ష్యమైన హిందూ స్వరాష్ట్ర సంకల్పానికి మొదటినుండి కట్టుబడిన వ్యక్తి తానాజీ . ఆయన ఛత్రపతికి నమ్మకమైన సహచరుడు. తన కుమారుడి వివాహం నిశ్చమైనా కూడా, శివాజీ మహారాజు తనకు కొండానా దుర్గాన్ని జయించే బాధ్యతను అప్పగించడంతోతన కొడుకు వివాహాన్ని వాయిదా వేసి కొండానాకు బయలు దేరాడు. కానీ చాలామంది బిడ్డ పెళ్లి పెట్టుకుని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం ఏంటి.? అని అడిగితే తానాజీ “పహిలా లగీన్ కొండానా చా.. మగ్ మయిచా రాయ్బచా కా” అని అంటాడు.

దీని అర్ధం ఏంటంటే “ముందు వెళ్లి కొండానా కి పెళ్లి చేద్దాం.. తర్వాత నా కొడుకు రాయబ్చా కి చేస్తా” అని . చత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజామాత అప్పటికే మళ్ళీ ఎప్పుడైతే కొండానా కోట మీద భగవద్వజం ఎగురుతుందో, మళ్ళీ అప్పుడే తాను పాదరక్షలు ధరిస్తానని శపధం చేసి ఉంటుంది. ఇక శివాజీ మహారాజ్ తల్లి దగ్గరకు వెళ్ళిన తానాజీ ఆమెతో అమ్మా…! నీ మొదటి బిడ్డ మనందరి కోసం స్వరాజ్యం సాధించాడు. ఈ బిడ్డకు కనీసం నీ కాలికి చెప్పులు ధరింపచేసే అవకాశం ఇవ్వు అని అడుగుతాడు. ఆమె గంభీరమైన స్వరంతో యశశ్వీభవ అని దీవించి పంపుతుంది.

కొండానా కోటను జయించడానికి తానాజీ, అతని తమ్ముడు సూర్యాజీ, మామ శేలార్ తోపాటు 1000 మంది యోధులతో బయలుదేరి వెళ్తాడు. 1670 ఫిబ్రవరి 4న తానాజీ కొండాణ దుర్గంపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన వెంట తమ్ముడు సూర్యాజీ, 5 వందల మంది మెరికల వంటి మావళే యోధులు ఉన్నారు. కొండానా కోటకు రెండు వైపులనే ద్వారాలు ఉంటాయి. వాటి పొడువునా సైనికుల కట్టుదిట్టమైన పహరా ఉంటుంది. మిగిలిన వైపుల సహజ సిద్ధమైన పర్వాతాలు ఉన్నాయి. వీటి మీదగా మనుష్యులు ఎక్కిరావడం అసంభవం అని భావించి ఆ వైపున గస్తీ ఏర్పాట్లు వాళ్ళు చెయ్యలేదు.
రాయగఢ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కొండాణ కోటకు ఈ కిలేదారు గా ఉన్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు, రాజపుత్ర సర్ధార్ ఉదయభాను రాఠోడ్. ఔరంగజేబ్ శివాజీ మరియు తానాజీ లను ఎదుర్కోడానికి ఇంకొక పక్క కూడా హిందువునే ఏర్పాటు చేసాడు. అతనికి యావత్ దక్షిణ భారతదేశ పరిపాలన బాద్యతలు ఇస్తానని హామీ ఇస్తాడు. కొండానా కోట బురుజు మీద ఫిరంగులు కూడా ఏర్పాటు చెయ్యబడి ఉన్నాయి. ఉదయభాన్ ఆధ్వర్యంలో 5 వేల మంది సైనికులు, ఇంకా అదనంగా మొఘల్ సైనికులు ఆసమయంలో కోటలో ఉన్నారు.

ఇక కొండానా కోటలోకి ప్రవేశించడానికి తానాజీ తన దగ్గర ఉన్న యశ్వంత్ అనే ఉడుముకి తేనే రాసి, ఏటవాలుగా ఉన్న కొండ పైకి వదలగా, అది కొండ చివరి అంచుకు వెళ్లి, అక్కడ గట్టిగా పట్టుకుని ఉంది. ఆ ఉడుము పట్టు సహాయంతో సైనికులు అందరూ కొండ పై భాగానికి చేరే ప్రయత్నంలో మొఘల్ సైనికులు వీళ్ళను చూసేస్తారు. ఇక అప్రమత్తం అయిన తానాజీ ఉన్న కొద్ది సైనికులతో యుద్ధం మొదలుపెడతాడు. కేవలం ఆ 300 మంది కోటలో అప్పటికే చుట్టుముట్టి ఉన్న 1500 మందితో యుద్ధం చేస్తారు. అప్పటికే నిద్రలో ఉన్న ఉదయభాన్ మేల్కొని మిగిలిన అందరి సైన్యంతో అక్కడికి చేరుకోగా, మరాఠా యోధులు “”హర హర మహాదేవ” అని నినాదాలతో శత్రు సైనికులను ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు.

ఇక రెండు కొండలు డీ కొన్నట్లుగా ఉదయభాన్ మరియు తానాజీ తలపడతారు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన తానాజీ తన తలపాగా ని చేతికి డాలుగా అమర్చుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ పరస్పర యుద్ధంలో తానాజీ నేలకోరుగుతాడు. ఇది చూసిన తానాజీ తమ్ముడు సూర్యాజీ ఉదయ భాన్ తో యుద్దంచేసి అతని చంపేస్తాడు.

ఇక తుదిశ్వాస తోఉన్న తానాజీ తన సైనికులకు శివాజీ మాటలు గుర్తు చేస్తాడు
“ఒక ధూళి కణం లో ఎలా అయితే పర్వతం దాగి ఉంటుందో
ఒక విత్తనం లో ఎలా అయితే ఒక మహా అరణ్యం దాగి ఉంటుందో
ఒక వీరుడి ఖడ్గం లో ఎలా ఒక మహాయుద్ధం దాగి ఉంటుందో; అలాగే ఒక మరాఠా యోధుడు ఒక్కొక్కడి లోనూ కొన్ని లక్షలమంది యోధుల స్ఫూర్తి ఉంటుంది.” అని చెప్పగా; అక్కడ ఉన్న ప్రతి మరాఠా సైనికుడు గట్టిగా “ఎక్ మరాఠా – లాఖ్ మరాఠా” అని నినాదాలు చేస్తూ శత్రువుల పై తిరగబడతారు. చివరకి కోట మరాఠా సైనికుల సొంతం అవుతుంది. కోటపై విజయ సూచికగా భగవధ్వజం ఎగరేస్తారు.

చత్రపతి శివాజీ మహారాజ్ రాయగడ్ నుండి బయలుదేరి వచ్చేసరికి ఆయన కు అర్ధం అయ్యేలా కొండానా కోటపై జ్వాలా వెలిగిస్తారు మరాఠా సైనికులు. అక్కడకు వచ్చి విగతజీవుడిగా పడి ఉన్న వీర తానాజీను చూసి శివాజీ ఎంతో బాధపడతాడు. కన్నీళ్ళతో “గడ్ ఆలా పన్ సింహ్ గిలా రే” అని బిగ్గరగా ఏడుస్తాడు. దానికి అర్ధం “కోట అయితే దక్కింది కానీ నా సింహం వెళ్ళిపోయింది.” అప్పటినుండి మరాఠా జానపద గీతాలలో ఆ మాట నిలిచిపోయింది. తన స్నేహితుడు ఆ కోటను జయించిన విజేత వీర తానాజీ గుర్తుగా ఆ కోటకు “సింహ్ గడ్” అని పేరు పెడతాడు శివాజీ. అప్పటినుండి ఆ కొండానా కోట సింహ్ గడ్ కోటగా చరిత్రలో నిలిచిపోయింది.

ఆ విధంగా 10 వేలమందితో కూడా ఆక్రమించడానికి అందరూ ఆలోచించే ఆ సింహ్ గడ్ కోటను వీర తానాజీ కేవలం 50౦0 మందితో వెళ్లి గెలుస్తాడు. వారిలో కూడా కేవలం 50 మంది మాత్రమే అమరులౌతారు. భావితరాలకు అందరూ తమ ఆస్తులు లేదా అప్పులు వదిలివెళ్తారు. కానీ కొంతమంది మాత్రమే కొన్ని తరాలకు స్పూర్తిగా నిలిచే జీవితాన్ని జీవించి, తాము చేపట్టిన బాద్యతను తమ వారసులకు ఆపగించి వెళ్తారు. అదేవిధంగా తానాజీ “దేశ స్వరాజ్యాన్ని సాధించే బాద్యత నీకు ఇచ్చి వెళ్తున్నా” నంటూ తన కొడుకుతో అంటాడు.
సుబేదార్ తానాజీ జీవితం ఆధారంగా మరాతాలో ఎన్నో నాటకాలు వచ్చాయి . “మగధీర” కథను సుబేదార్ తానాజీ నిజ జీవిత నేపథ్యం నుంచి తీసుకున్నామని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాహాటంగానే చెప్పారు. ఒక్కడు సవాల్ చేసి 100 మందిని చంపడం అనే సంఘటన తానాజీ స్పూర్తితోనే వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ తన 100వ సినిమా తానాజీ – the unsung warrior అనే సినిమాను తీసారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. మనం ఇంతకుముందు చెప్పినట్లు; యుద్ధం గెలిచిన వాళ్ళు మాత్రమే కాదు యుద్ధం గెలిపించిన వాళ్ళ చరిత్ర కూడా ప్రపంచం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటివరకూ మార్పు అనేది కేవలం హింస కి అహింస కి అతీతంగా త్యాగం వల్లే సాధ్యమవుతూ వస్తోంది.
ఇది వీర మరాఠా యోధుడు తానాజీ కథ…..

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All