Homeటాప్ స్టోరీస్మనకు తెలియని మరో మహా యోధుడి కథ “తానాజీ”

మనకు తెలియని మరో మహా యోధుడి కథ “తానాజీ”

Tanhaji The Unsung Warrior trailer released
Tanhaji The Unsung Warrior trailer released

1670 ఫిబ్రవరి 4 న జరిగిన ఒక సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఒక సినిమా వస్తోంది.  ఒక యుద్ధంలో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్లు మాత్రమే కాదు; ఆ యుద్ధాన్ని  గెలిచేలా చేసినవాళ్లు లేదా గెలవాల్సిన యుద్ధాన్ని వెన్నుపోటుతో ఓడించిన వాళ్లు కూడా ముఖ్యమే. చరిత్ర పుటలలో అనేక గొప్ప యుద్ధాలు ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పరాయి పాలకుల యొక్క స్వార్థపూరితమైన కుట్ర వల్ల ప్రస్తుత తరానికి అందకుండా చేయబడ్డాయి.

చరిత్ర విస్మరించిన వీరులలో ఒకానొక మహా యోధుడు సుబేదార్ తానాజీ మాల్సారి. ఆ అద్భుతమైన యోధుడి కథను ప్రస్తుతం వెండితెరపైకి తీసుకొస్తున్నారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. ఓం రౌత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న  ఈ సినిమాని అజయ్ తన స్వీయనిర్మాణంలో చేస్తూ ఉండగా, అతని నిజ జీవిత భాగస్వామి అయిన కాజోల్ ఈ సినిమాలో అతని భార్యగా నటిస్తోంది. చాలా కాలం తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఒక శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

- Advertisement -

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ప్రస్తుతం రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తోంది.  ఇటీవల రిలీజైన మరొక యుద్ధం నేపథ్య చిత్రం అయిన “పానిపట్” సినిమా కన్నా, ఈ సినిమా పదిరెట్లు అద్భుతంగా మరియు గొప్పగా ఉందని సినిమా అభిమానులు, ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక ఈ కథ విషయానికి వస్తే,  మొగల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశానికి ఢిల్లీ ఎలా రాజధాని గా ఉందో;  అలాగే దక్షిణ భారత దేశానికి కూడా “కొండానా” అనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని, ఆ ప్రాంతంతో పాటు యావత్ దక్షిణ భారత దేశం తమ కింద ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకే ఒక వ్యక్తి బ్రతికి ఉండగా భారతదేశంలో ఎటువంటి పరాయి పాలకుల ఆధిపత్యం చెల్లదని వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్.

మరాఠా సామ్రాజ్య స్థాపన తో మొదలుపెట్టి యావత్ భారతదేశానికి స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం తో ఉంటాడు చత్రపతి శివాజీ మహారాజ్. “కొండాన” ప్రాంతాన్ని ఆక్రమించడానికి మొగలు సైన్యం తమ వంతు ప్రయత్నం లో ఉండగా ఆ ప్రాంతాన్ని వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడే బాధ్యతను స్వయంగా తీసుకుంటాడు సుబేదార్ తానాజీ.

ఈ నేపధ్యంలో అతను చాలా తక్కువ సైన్యం  అండతోనే అనేకమంది సైన్యం ఉన్న మొగల్స్ తో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో  యావత్ కొండాన ప్రాంతాన్ని సంరక్షిస్తూ అతను చేసిన యుద్ధం నేపథ్యమే ఈ సినిమా.

నిజం చెప్పాలంటే, 2009లో రిలీజై పెద్ద హిట్ అయిన తెలుగు సినిమా “మగధీర” కథను సుబేదార్ తానాజీ నిజ జీవిత నేపథ్యం నుంచి తీసుకున్నామని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాహాటంగానే చెప్పారు. ఒక్కడు సవాల్ చేసి 100 మందిని చంపడం అనే సంఘటన నిజజీవితంలో చేసి చూపించిన వ్యక్తి సుబేదార్ తానాజీ.  ఇక ఈ ట్రైలర్ లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క అణుబాంబు లాగా ఉంది.

సుబేదారి తానాజీ తన సైన్యంతో చెప్పిన ఒక డైలాగ్  ఉదాహరణకి చెప్పుకుంటే

ఒక ధూళి కణం లో ఎలా అయితే పర్వతం దాగి ఉంటుందో
ఒక విత్తనం లో ఎలా అయితే ఒక మహా అరణ్యం దాగి ఉంటుందో
ఒక వీరుడి ఖడ్గం లో ఎలా ఒక మహాయుద్ధం దాగి ఉంటుందో;  అలాగే ఒక మరాఠా యోధుడు ఒక్కొక్కడి లోనూ కొన్ని లక్షలమంది యోధుల స్ఫూర్తి ఉంటుంది.

ఈ సినిమా వచ్చే సంవత్సరం 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

చివరిగా ఒక మాట చెప్పాలంటే; యుద్ధంలో మనుషులు ఉండటం కాకుండా ఒక మనిషిలో యుద్ధం ఉంటే, ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన రా..రా..రా ..రా  అనే పాట వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. ఒక్క సారి ట్రై చేయండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All