Homeటాప్ స్టోరీస్మరో ఆల్కహాల్ కామెడీ సినిమా – “తాగితే తందానా”

మరో ఆల్కహాల్ కామెడీ సినిమా – “తాగితే తందానా”

Tagite Tandana Movie TEASER released
Tagite Tandana Movie TEASER released

హాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో ఒక జోనర్ ఉంది. దానినే బడ్డీ కామెడీ అంటారు. దీని ప్రకారం సినిమా తీయాలంటే గొప్ప కథ, ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టు లు, బడ్జెట్ లేకున్నా; బ్రేక్ కోసం ఎదురు చూసే నలుగురు మంచి నటీ నటులను ఎంపిక చేసుకుని వాళ్ళ మధ్య ప్రస్తుత సమాజంలో ట్రెండ్ అయ్యే విషయాలకు కొంచెం లవ్ & కామెడీ గొడవలు అనుమానాలు, మిస్ అండర్ స్టాండింగ్ వంటి అంశాలు జోడించి సినిమా తీసేస్తారు. కానీ, ప్రస్తుతం వాటికి కొంతమంది కమర్షియల్ హంగుల పేరుతో అశ్లీలత కూడా యాడ్ చేస్తున్నారు. దానికి పెద్ద స్టైల్ గా బ్లాక్ కామెడీ అని సబ్ హెడ్డింగ్ పెడుతున్నారు.

గతంలో మారుతి తన శిష్యులతో కలిసి, ఇలాంటి కొన్ని సినిమాలు తీసి మరీ ఇజ్జత్ పోతోందని గ్రహించి సైలెంట్ అయిపోయాడు. ఈ మధ్యనే “ఉండిపోరాదే” అని పాట మాత్రమే హిట్ అయ్యి సినిమా పరంగా ఫ్లాప్ అయిన “హుషారు” వీటి కోవకు చెందుతుంది. ప్రస్తుతం అజిత్, సప్తగిరి, మధునందన్ కలిసి చేసిన “తాగితే తందానా” అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది కూడా ముగ్గురు స్నేహితులు, వాళ్ళ జీవితంలో బాధలు, వాటి నుండి బయట పడటానికి వాళ్ళు చేసే తెలివి తక్కువ పనులు ఇలా మంచి సెటైరికల్ కామెడీ తో యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది.

- Advertisement -

ముఖ్యంగా చివరలో అదిత్, సప్తగిరి, మధునందన్ లు ముగ్గురూ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ మాస్క్ లు పెట్టుకుని కనిపించడం; బాలకృష్ణ మాస్క్ పెట్టుకున్న సప్తగిరి “ఏదైనా తేడా వస్తే వీళ్ళను అరెస్ట్ చేస్తారు” అంటాడు. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రం స్నేహితుడు అయిన “”ఆకు తిను” మాణిక్ రెడ్డి, కాలకేయ ప్రభాకర్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా don’t drink & think అనే ట్యాగ్ లైన్ తో tax payers అందరినీ టార్గెట్ చేసినట్లుగా కనపడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All