
కమెడియన్ సప్తగిరి హీరోగా మారి పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే . సప్తగిరి ఎక్స్ ప్రెస్ విజయం సాధించగా సప్తగిరి ఎల్ ఎల్ బి షాక్ ఇచ్చింది దాంతో కొంత గ్యాప్ తీసుకొని వజ్రకవచధర గోవింద చిత్రం చేసాడు . ఈనెల 14 న విడుదలైన ఈ చిత్రానికి బిసి కేంద్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి దాంతో సక్సెస్ మీట్ పెట్టారు . అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నరేంద్ర – జి ఎన్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించారు .
ఇక ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఈనెల ఆఖరున సప్తగిరికి దయ్యం పట్టింది అనే మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం అంటూ ప్రకటించారు వేదిక మీద . సప్తగిరికి దయ్యం పట్టింది అనే చిత్రం మొత్తం నవ్వుల పువ్వులు పూయిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు . వజ్రకవచధర గోవింద చిత్రాన్ని నిర్మించిన వాళ్ళే ఈ సప్తగిరికి దయ్యం పట్టింది అనే చిత్రాన్ని నిర్మించనున్నారట.