
విభిన్న కథా చిత్రాలతో తాప్సీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. నటనకు ఆస్కారం వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ విమర్శకులని సైతం మెప్పిస్తోంది. ఇటీవల పింక్, ముల్క్, బద్లా, గేమ్ ఓవర్, థప్పడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ మహిళా ప్రధాన చిత్రాలకు బాలీవుడ్‌లో ఒక విధంగా చెప్పాలంటే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
వరుస సక్సెస్‌లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తాప్సీ ప్రస్తుతం రిలాక్స్ కావాలనుకుందట. ఇందు కోసం మల్దీవ్స్‌ని వెకేషన్‌కి ఎంచుకుంది. ఇటీవలే తన చెల్లెలితో కలిసి మాల్దీవ్స్ చెక్కేసింది. అక్కడి దీవుల్లో టూ పీస్ బికినీల్లో విహరిస్తూ బీచ్ లొకేషన్స్‌ని హీటెక్కించేస్తోంది. తాజ్ గ్రూప్ హోటల్లో ఎంజాయ్ చేస్తున్న తాప్సీ కలర్ ఫుల్ బికినీ ధరించి సముద్రపు అలలపై వేలాడే వల చిరవరన కూర్చుని ఫొటోలకు పోజులిచ్చింది.
దీనికి సంబంధించిన పిక్స్ ఇన్ న్ స్టాని హీటెక్కించేస్తున్నాయి. చాలా రోజుల తరువాత తాప్సీ హాట్ అవతారం ఎత్తడంతో అంతా అవాక్కవుతున్నారు. నీలి వర్ణం సముద్రం.. వేలాడే వలపై హొయలొలికిస్తున్న తాప్సీ ఆ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న చిత్రం `జన గణ మన`పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది.