
కరోనా ఏమో గాన స్టార్స్ అంతా మూకుమ్మడిగా పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. గడిచిన ఏడు నెలల కాలంలో లాక్‌డౌన్ విధించడంతో ఇంటి పట్టునే వున్న స్టార్స్ ఇప్పుడిప్పుడే బయట అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది స్టార్స్ పెళ్లి కబురు చెప్పేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరబోతున్న విషయం తెలిసిందే.
తను గత కొంత కాలంగా ప్రేమలో వున్న ఇంటీరియర్ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లూని ఈ నెల 30న ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకోబోతున్నానని ఇటీవల కాజల్ అగర్వాల్ ప్రకటించింది. ఇదిలా వుంటే మరో క్రేజీ హీరోయిన్ పెళ్లికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. గత కొంత కాలంగా వరుస సినిమాలతో బిజీగా గడిపేసిన తాస్సీ ఇటీవల వెకేషన్ కోసం మల్దీవ్స్ వెళ్లింది.
అక్కడి బీచ్‌లో టూ పీస్ బికినీ ధరించి హల్‌చల్ చేస్తోంది. తాజాగా బయటికి వచ్చిన ఓ ఫొటో తాప్సీ బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మాథ్యూస్ బోయే మాల్దీవ్స్‌లో తాప్సీతో కలిసి కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాప్సీ బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయడం కోసమే మాల్దీవ్స్‌కి వెకేషన్‌కి వచ్చినట్టు గా కనిపిస్తోంది. దీంతో త్వరలో కాజల్ తరహాలోనే తాప్సీ కూడా పెళ్లి వార్త చెప్పినా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.