Homeటాప్ స్టోరీస్ఆ ప‌దానికి అర్థం ఈ మ‌ధ్య‌నే తెలిసింది: తాప్సీ

ఆ ప‌దానికి అర్థం ఈ మ‌ధ్య‌నే తెలిసింది: తాప్సీ

ఆ ప‌దానికి అర్థం ఈ మ‌ధ్య‌నే తెలిసింది: తాప్సీ
ఆ ప‌దానికి అర్థం ఈ మ‌ధ్య‌నే తెలిసింది: తాప్సీ

`బేబీ` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ కొత్త త‌రహా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. ఇటీవ‌ల నామ్ ష‌బానా, బ‌ద్లా, పింక్‌, సాండ్ కీ అంఖ్ వంటి చిత్రాల‌తో న‌టిగా ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాదు ప‌లు అవార్డుల్ని కూడా ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా తాప్సీ న‌టించిన హిందీ చిత్రం `త‌ప్ప‌డ్‌`. ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మీడియాతో పంచుకుంది.

`పితృస్వామ్య వ్య‌వ‌స్థ అనే ప‌దానికి అర్థం త‌న‌కు ఈ మ‌ధ్య‌నే తెలిసింద‌ని, సాధార‌ణంగా ఏ తండ్రి త‌న కూతుర్ని బ‌య‌టికి వెళ్ల‌నివ్వ‌రు. తిర‌గ‌నివ్వ‌రు. రాత్రి 8 దాటిందంటే ఖ‌చ్చితంగా ఇంటికి వ‌చ్చితీరాల‌ని చెబుతుంటారు. ఎందుకంటే బ‌య‌ట యువ‌కులు ప్ర‌మాద‌క‌రంగా తిరుగుతున్నార‌ని చెబుతార‌ట‌. ఇవ‌న్నీ తాను బాలీవుడ్‌లో సినిమాలు చేయ‌డం వ‌ల్లే త‌న‌కు తెలిసింద‌ని, అమ్మాయిలు ధైర్యంగా ఏవ‌రినైనా ప్ర‌శ్నించ‌గ‌లిచే వాతావ‌ర‌ణంలో తాను పెరిగాన‌ని, కాబ‌ట్టీ ఇన్నాళ్లు త‌న‌కు ఇవ‌న్నీ తెలియ‌లేద‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -

స‌మాజంలో స్త్రీ, పురుషుల మ‌థ్య లేడా, వేతనాల్లో తేడా వుంద‌ని, ఇది పోవాల‌ని, క‌నీసం భావిత‌రాలైనా దీని నుంచి విముక్తి పొందాల‌ని, దీనిపై అవ‌గాహ‌న క‌లిగించిన‌ప్పుడే ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తుంద‌ని, స్త్రీ, పురుషుల్లో తేడాలు ఎంత కాలం అని అరిచినంత మాత్రాన ఎలాంటి మార్పు వుండ‌ద‌ని తాప్సీ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All