Homeటాప్ స్టోరీస్సైరాకు హిందీ మార్కెట్ లో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఇదే!

సైరాకు హిందీ మార్కెట్ లో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఇదే!

Syeraa positive factor in hindi market
Syeraa positive factor in hindi market

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెలుగులో బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయం. సినిమా బాగుంటే సైరా తెలుగులో కాసుల వర్షం కురిపిస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ అసలు దృష్టాంతా సైరా హిందీలో ఎలా ఆడుతుంది అన్నదానిపైనే ఉంది. ప్రమోషన్స్ మరీ భారీగా చేయకపోయినా సైరా హిందీలో దాదాపు 1,500 స్క్రీన్లలో ప్రదర్శితమవుతుంది.

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వార్ సినిమా విడుదలవుతుండగా సైరాకు ఇన్ని స్క్రీన్లు పట్టడం మాములు విషయం కాదు. ఇంత భారీగా విడుదలవుతోంది ఓకే.. మరి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆడుతుంది అన్న సందేహాలు ఉన్నాయి. సైరా పాట్రియాటిక్ భావాలున్న చిత్రం. బ్రిటీషు వారి మీద ఎదురుతిరిగిన ఒక యోధుడి కథ. సైరా స్టోరీ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి, అటువంటిది స్క్రీన్ పైన ఆ సీన్లు చూస్తుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు.

- Advertisement -

నిజానికి బాలీవుడ్ లో ఊర మాస్ అంశాలు, యుద్ద సన్నివేశాలు, భారీ తనం తక్కువే. అక్కడ వ్యవహారమంతా క్లాస్ గా ఉంటుంది. కానీ నార్త్ రూరల్ ప్రాంతాల్లో మాస్, భారీతనాన్ని, ఫైట్స్ ను ఎంతగా ఇష్టపడతారో అన్న దానికి బాహుబలి, సాహో ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ అంశాలన్నీ ఉన్న సైరా బాలీవుడ్ లో హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All