Homeటాప్ స్టోరీస్ఏంటి ఏకంగా బ్రేక్ ఈవెన్ నంబర్స్ తగ్గించేస్తారా?

ఏంటి ఏకంగా బ్రేక్ ఈవెన్ నంబర్స్ తగ్గించేస్తారా?

ఏంటి ఏకంగా బ్రేక్ ఈవెన్ నంబర్స్ తగ్గించేస్తారా?
ఏంటి ఏకంగా బ్రేక్ ఈవెన్ నంబర్స్ తగ్గించేస్తారా?

సినిమా హిట్ ఆ ఫట్టా అని నిర్ణయించేది ప్రాధమికంగా తొలిరోజు టాక్ అయినా కూడా అంతిమంగా కలెక్షన్స్ సినిమా ఫేట్ డిసైడ్ చేస్తాయి. ఇక్కడ ఈక్వేషన్ చాలా సింపుల్. సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు తీసుకొస్తే హిట్ లేదంటే ఫట్. అయితే మనకు నిఖార్సైన కలెక్షన్స్ అందించే సోర్స్ లేకపోవడం పెద్ద చిక్కు తీసుకొస్తోంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే సైరా కలెక్షన్స్ విషయంలో గందరగోళం జరుగుతోంది.

యాంటీ మెగా ఫ్యాన్స్ ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ఫేక్ అంటుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా హిట్ అంటున్నారు. నిజానికి సైరా తెలుగు రాష్ట్రాల్లో ఎబోవ్ యావరేజ్ గా ఆడుతోంది. మిగతా అన్ని చోట్లా ఈ చిత్రం ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో సైరాను హిట్ అని ప్రచారం చేయడాన్ని యాంటీ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు.

- Advertisement -

ఎక్కడైనా కలెక్షన్స్ ఫేక్ చేయడం సాధారణం కానీ మెగా ఫ్యాన్స్ మరో మెట్టు ఎక్కి కలెక్షన్స్ ఫేక్ చేయడం కాదు, ఏకంగా బ్రేక్ ఈవెన్ ఫిగర్ నే తగ్గించేశారని యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మొదట 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సైరాకు 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని మొదట అన్నారు, తీరా ఇప్పుడు చూస్తే 150 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ అంటున్నారు. సైరాను హిట్ అనిపించడానికి జరిగిన బిజినెస్ ను కూడా మార్చేస్తారా అంటున్నారు యాంటీ ఫ్యాన్స్. దీనిపై మెగా ఫ్యాన్స్ స్పందనేంటో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All