Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్శతకం కొట్టిన సైరా.. 12 డేస్ కలెక్షన్స్

శతకం కొట్టిన సైరా.. 12 డేస్ కలెక్షన్స్

Sye Raa Collections
Sye Raa Collections

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా దసరా అడ్వాంటేజ్ ను తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ గా వాడుకుందనే చెప్పాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి సైరా కొన్ని ల్యాండ్ మార్క్ లను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సైరా 100 కోట్ల షేర్ ను దాటింది. తద్వారా బాహుబలి 1 అండ్ 2 తర్వాత ఈ ఫీట్ అందుకున్న మూవీగా నిలిచింది. మరోవైపు నైజాంలో ఈ చిత్రం 30 కోట్ల షేర్ ను అందుకుంది.

- Advertisement -

నైజాంలో 30 కోట్లకు ఈ చిత్రం బిజినెస్ జరగడంతో ఇకపై అక్కడ డిస్ట్రిబ్యూటర్ లాభాలు అందుకోనున్నాడు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లో ఉన్న సంగతి తెల్సిందే. తెలంగాణలో ప్రభుత్వం మరో వారం రోజులు సెలవులు పొడిగించడంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ ఆనందంగా ఉన్నాడు. ఇది చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు.

మరో రెండు వారాలు పెద్ద సినిమా ఏదీ విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో సైరా ఎంత వసూలు చేస్తుందనేది చూడాలి. తెలుగు భాషలో పర్వాలేదనిపించిన సైరా మిగిలిన భాషల్లో ఫెయిల్యూర్ గా నిలిచింది. అలాగే యూఎస్ లో 2.5 మిలియన్ మార్క్ కు చేరువగా వచ్చిన సైరా మరో అర మిలియన్ అందుకుంటే కానీ సేఫ్ అవ్వదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యమనే చెప్పాలి.

12 రోజుల సైరా కలెక్షన్స్ బ్రేక్ డౌన్

ప్రాంతం                షేర్ (కోట్లలో)

నైజాం                            31.02

సీడెడ్                             18.19

నెల్లూరు                          4.35

కృష్ణ                                7.18

గుంటూరు                        9.35

వైజాగ్                              15.44

ఈస్ట్                                8.78

వెస్ట్                                 6.29

మొత్తం                         100.60

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts