
యంగ్ టాలెంట్ నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`. సైలెంట్‌గా ఇడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి నవీన్ పొలిశెట్టికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా స్వరూప్ ఆర్.ఎస్.జె. చిరంజీవి నటించిన `చంటబ్బాయి` ఫ్లేవర్‌ని గుర్తుచేస్తూ కొత్త పాయింట్‌తో చేసిన ఈ చిత్రం దర్శకుడు స్వరూప్‌కి కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో స్క్రిప్ట్‌కి తుదిమెరుగులు దిద్దుతున్న దర్శకుడు లాక్‌డౌన్ తరువాత ప్రీప్రొడక్షన్ వర్క్‌ని ప్రారంభించాలనుకుంటున్నాడట. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించిన స్వరూప్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
దర్శకుడిగా తనకో డ్రీమ్ వుందని, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌కాన్, టాలీవుడ్ `బాహుబలి` ప్రభాస్‌ల కలయికలో క్రేజీ మల్టీస్టారర్‌ని తెరకెక్కించాలని వుందట. అవకాశం వస్తే మల్టీస్టారర్‌ని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తాడట. మరి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ డ్రీమ్ ఇప్పట్లో కుదిరేపని కాదని అర్థమవుతోంది.