Homeటాప్ స్టోరీస్సుశాంత్ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ కేసులో మ‌రో ట్విస్ట్‌!
సుశాంత్ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ మ‌ర‌ణం పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ ది ఆత్మ హ‌త్య కాద‌ని, హ‌త్య అని ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. దానికి సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణ‌మ‌ని సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో సుశాంత్ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. తాజాగా సుశాంత్ మ‌ర‌ణంపై ఫోరెన్సిక్ నిపుణులు అత‌ని బెడ్ రూమ్‌లో గుస‌గుస‌లాడుతున్న వీడియో క‌ల‌క‌లం రేపుతోంది.

తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఈ వీడియో సుశాంత్ ది ఆత్మ హ‌త్య కాద‌ని, హ‌త్యేన‌ని నిరూపించేలా క‌నిపిస్తోంది. ఈ వీడియోలో ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ కు చెందిన పోలీసులు ఈ వీడియో బ‌య‌టికి వ‌స్తే చాలా ప్ర‌మాదం అని చెబుతున్న మాట‌లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే ఈ వీడియో ఎవ‌రు తాశారు. మార్ఫిగ్ ఏమైనా చేశారా? అన్నది తెలియాల్సి వుంది. ఆ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తే సుశాంత్ మ‌రణాన్ని ఆత్మ హ‌త్య‌గా చిత్రించాల‌ని ఏ పోలీస్ అధికారి ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న‌ది బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -

ఓ ప్ర‌ముఖ జాతీయ ఛాన‌ల్ ఈ వీడియో ఆధారంగా సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్రసారం చేయ‌డంతో ఈ వివాదం కొత్త మ‌లుపు తిరిగేలా క‌నిపిస్తోంది. ఇదిలా వుంటే ఇదే స‌మ‌యంలో సుశాంత్ ఆత్మ హ‌త్య కేసుని సీబీఐకి అప్ప‌గించాలంటూ వేసిన ఓ పిటీష‌న్‌ని సుప్రీమ్ కోర్టు తిర‌స్క‌రించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All