Homeటాప్ స్టోరీస్సుశాంత్ ఆత్మ మాట్లాడుతోందా?

సుశాంత్ ఆత్మ మాట్లాడుతోందా?

సుశాంత్ ఆత్మ మాట్లాడుతోందా?
సుశాంత్ ఆత్మ మాట్లాడుతోందా?

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హ‌ఠాన్మ‌ర‌ణం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అత‌ను చ‌నిపోయి నెల రోజుల‌కు పైగా అవుతున్నా ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణంపై దేశ వ్యాప్తంగా సందేహాలు, ఎన్నో ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతూనే వున్నాయి. నెపోటిజ‌మ్ పై చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. సుశాంత్ మాన‌సిక ఒత్తిడి కార‌ణంగానే చ‌నిపోయాడ‌ని కొంత మంది వాదిస్తుంటే మ‌రి కొంత మంది దావూద్ గ్యాంగ్ హ‌త్య చేసింద‌ని వాదిస్తున్నారు. పోలీసులు ఎంక్వైరీలో మాత్రం సుశాంత్ ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది.

సుశాంత్ మ‌ర‌ణంపై పోలీసులు క్లారిటీ ఇచ్చినా అభిమానుల్లో మాత్రం అనుమానాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే వున్నాయి. బంధు ప్రీతి కార‌ణంగా సుశాంత్ చ‌నిపోయాడా, లేక ఎవ‌రైనా హింసించి ఆత్మ హ‌త్య చేసుకునేలా చేశారా?  లేదా వైరాగ్యం వ‌ల్లే సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పూనుకున్నాడా? అన్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకోవాల‌ని, అత‌ని ఆత్మ‌తో సంప్ర‌దించాల‌ని ప్ర‌ముఖ పార్మానార్మ‌ల్ యాక్టివిస్ట్ స్టీఫ్ హుఫ్‌కు గ కొన్ని రోజులుగా ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి సుశాంత్ అభిమానులు ఈమెయిల్స్‌, మెసేజ్‌లు పంపించార‌ట‌.

- Advertisement -

దీంతో స్పందించిన స్టీవ్ హుఫ్ ఆస్ట్ర‌ల్ డోర్ వే స‌హాయంతో సుశాంత్ ఆత్మ‌ని సంప్ర‌‌దించార‌ట‌. దీనికి సంబంధించిన ఓ వీడియోని స్టీవ్ హుఫ్ సోష్ మీడియా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో సుశాంత్ ఆత్మ‌కు ప‌లు ప్ర‌శ్న‌లు కూడా అడిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సెష‌న్‌కు కొన‌సాగింపుకూడా వుంటుంద‌ని స్టీవ్ హుఫ్ వెల్ల‌డించ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న సుశాంత్ అభిమాన‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All