Homeటాప్ స్టోరీస్మ‌రో కొరియ‌న్ ఫిల్మ్‌తో సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌!

మ‌రో కొరియ‌న్ ఫిల్మ్‌తో సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌!

మ‌రో కొరియ‌న్ ఫిల్మ్‌తో సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌!
మ‌రో కొరియ‌న్ ఫిల్మ్‌తో సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌!

కొరియ‌న్ చిత్రాల్ని గ‌తంలో మ‌న వాళ్లు ఫ్రీమేక్ చేసేవాళ్లు `బాహుబ‌లి` త‌రువాత తెలుగులో సినిమా వ‌స్తోందంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. మా సినిమా కాపీ చేస్తున్నారా? అని హాలీవుడ్ వాళ్లు చూస్తుంటే మ‌ళ్లీ ఎలాంటి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నారా అని బాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. దీంతో కాపీ చేయ‌డానికి ఆస్కారం ల‌భించ‌డం లేదు.

దీంతో న‌చ్చిన సినిమా ఏ భాష‌లో వ‌చ్చినా మ‌న వాళ్లు ఆ మూవీ రీమేక్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంటున్నారు. ఇటీవ‌ల కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా స‌మంత‌తో చేసిన `ఓ బేబీ` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసిన సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా మ‌రో కొరియ‌న్ మూవీ రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కొరియ‌న్ ఫిల్మ్ `ల‌క్ కీ` రీమేక్ హ‌క్కుల్ని  సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. 2016లో వ‌చ్చిన ఈ మూవీ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల‌తో పాటు భార‌తీయ భాష‌ల‌న్నింటోనూ రీమేక్ చేసే హ‌క్కుల్ని  సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్‌తో రీమేక్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All