Homeటాప్ స్టోరీస్బుడాపెస్ట్ లో లొకేషన్స్ వెతుకుతోన్న సురేందర్ రెడ్డి

బుడాపెస్ట్ లో లొకేషన్స్ వెతుకుతోన్న సురేందర్ రెడ్డి

బుడాపెస్ట్ లో లొకేషన్స్ వెతుకుతోన్న సురేందర్ రెడ్డి
బుడాపెస్ట్ లో లొకేషన్స్ వెతుకుతోన్న సురేందర్ రెడ్డి

స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు తనదైన స్టైల్ లో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఏజెంట్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అఖిల్ అక్కినేని ఈ స్లీక్ యాక్షన్ థ్రిల్లర్ లో హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం పూర్తిగా ఇమేజ్ మేకోవర్ కు వెళ్ళిపోయాడు అఖిల్. బాడీ పెంచి హెయిర్ స్టైల్ ను కూడా మార్చుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఈ చిత్రంలో హైలైట్ గా ఉంటాయని వినికిడి.

ఇప్పటికే ఏజెంట్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఇక ఇప్పుడు దర్శకుడు హంగేరి రాజధాని అయిన బుడాపెస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ షూటింగ్ కోసం లొకేషన్స్ ను వెతుకుతున్నాడు. పలు హాలీవుడ్ చిత్రాలు ఈ లొకేషన్ లో షూటింగ్ చేసుకున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ అక్కడ మొదలవుతుంది.

- Advertisement -

సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించనున్నాడు. అనిల్ సుంకర నిర్మాత.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All