Homeటాప్ స్టోరీస్అఖిల్ ఏజెంట్ కు మ్యూజిక్ డైరెక్టర్ మార్పు

అఖిల్ ఏజెంట్ కు మ్యూజిక్ డైరెక్టర్ మార్పు

అఖిల్ ఏజెంట్ కు మ్యూజిక్ డైరెక్టర్ మార్పు
అఖిల్ ఏజెంట్ కు మ్యూజిక్ డైరెక్టర్ మార్పు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల కోసం ఎదురుచూస్తోన్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం స్టైలిష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా తన ఫిజిక్, హెయిర్ స్టయిల్ మార్చుకున్నాడు. సురేందర్ సరికొత్తగా అఖిల్ ను ప్రెజంట్ చేయబోతున్నాడట.

ఇక ఏజెంట్ కు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాల్సి ఉంది కానీ థమన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏజెంట్ టీమ్ కు సరిగా రెస్పాండ్ కాలేదట. దీంతో సురేందర్ రెడ్డి థమన్ ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించి ఆయన స్థానంలో తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సురేందర్ రెడ్డితో ధ్రువ చిత్రానికి పనిచేసాడు హిప్ హాప్ తమిళ. తన వర్క్ నచ్చడంతో ఇప్పుడు ఏజెంట్ లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All