
అఖిల్ అక్కినేని ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి, నాలుగో చిత్రంగా చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. గత రెండున్నరేళ్లుగా ఈ చిత్రం ప్రొడక్షన్ దశలోనే ఉంది. కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.
అయితే మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ టీమ్ నుండి అధికారిక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 8న ఈ చిత్రం విడుదలవుతుందని తెలియజేసారు. దీంతో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న కొండ పొలం చిత్రంతో డైరెక్ట్ గా పోటీ పడబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించాడు.
ప్రస్తుతం అఖిల్ తన ఐదవ చిత్రం ఏజెంట్ లో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.