Homeటాప్ స్టోరీస్కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది

కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది

కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది
కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది

లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ టీమిండియా క్రికెట్ లో ఒక లెజండ్. తొలిసారి భారత్ తరుపున టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల మార్క్ ను అందుకుని చరిత్ర సృష్టించాడు. టీమిండియా ఎన్నో మరపురాని విజయాల్లో భాగమయ్యాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా, అనలిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు సన్నీ. స్వతహాగా చాలా కూల్ గా ఉండే సన్నీకి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల వల్ల కోపం వచ్చింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా సారధి. మూడు ఫార్మాట్లలోనూ జట్టుని ముందుండి నడిపిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలను సాకారం చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ కోహ్లీ సాధించిన పరుగుల రికార్డులు ఎన్నోన్నో. ఏకంగా సచిన్ రికార్డులకు ఎసరు పెట్టగల స్థాయిలో కోహ్లీ ప్రభంజనం కొనసాగుతోంది. వ్యక్తిగతంగా దూకుడుగా ఉండే కోహ్లీ, సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి కోహ్లీ మాటలకు సన్నీకి ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి చూస్తే..

ఇటీవలే టీమిండియా బాంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో వరసగా 7 విజయాలు సాధించింది అన్ని జట్ల కంటే అత్యధికంగా 360 పాయింట్లు గెలుచుకుని అగ్ర స్థానంలో కొనసాగుతోంది. విజయాలు సాధించడమే కాదు ప్రత్యర్థి జట్లపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తూ అఖండ విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ సౌరవ్ గంగూలీ సారధ్యంలోని జట్టు దూకుడుగా ఎలా ఆడాలో, ప్రత్యర్థులను ధీటుగా ఎలా ఎదుర్కోవాలో చూపించింది. మేమంతా ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య సన్నీ గవాస్కర్ కు కోపం తెప్పించింది.

- Advertisement -

ప్రతిఒక్కరూ గంగూలీ జట్టే విజయాలు సాధించింది అన్న తరహాలో మాట్లాడుతుంటారని, టీమిండియాకు దూకుడు అప్పుడే మొదలైందన్న భ్రమలో ఉంటారని, అయితే తాము ఆడుతున్నప్పుడు కూడా ఎన్నో విజయాలు అందుకున్నామని గవాస్కర్ గుర్తుచేశాడు. హేమాహేమలైన జట్లను తోసిరాజని 1983లోనే వరల్డ్ కప్ సాధించామని అంటున్నాడు. 70, 80లలో టీమిండియా సాధించిన అద్భుత విజయాలు ఎన్నో ఉన్నాయని, బహుశా విరాట్ కోహ్లీ అప్పటి పుట్టకపోయి ఉండడం వల్ల తెలీకపోవచ్చని, అవన్నీ తెలీకుండా గంగూలీ సారధ్యలోనే టీమిండియా విజయాలు సాధించడం మొదలైంది అన్నట్లుగా మాట్లాడడం సరికాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి తనను ప్రసన్నం చేసుకోవడం కోసం విరాట్ కోహ్లీ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని దుయ్యబట్టాడు.

మొత్తానికి గవాస్కర్ విమర్శలపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. నిజానికి టీమిండియా దూకుడు అన్న మాట రాగానే ఈ తరం వాళ్లకు సౌరవ్ గంగూలీ నాయకత్వమే గుర్తొస్తోంది. 70, 80 ల కాలంలో టీమిండియా ఆటను అందరూ మర్చిపోయారు. అలా అని గంగూలీని తక్కువ చేయడానికేం లేదు. అంతకు ముందు స్లెడ్జింగ్ అంటే మనవాళ్ళు భయపడేవారన్న మాట వాస్తవం, గంగూలీ సారధి అయ్యాకే మన వాళ్ళు దూకుడుగా సమాధానం చెప్పడం మొదలైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All