Homeగాసిప్స్కోహ్లీ తో జూనియర్ ఎన్టీఆర్

కోహ్లీ తో జూనియర్ ఎన్టీఆర్

jr ntr and Virat Kohli
jr ntr and Virat Kohli

క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓ యాడ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది . రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాటిని అరికట్టే క్రమంలో ఈ యాడ్ రూపొందిస్తున్నారు . రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం వల్ల జరుగుతున్నాయి దాంతో మద్యపానం సేవించడం డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అనర్దాలను వివరించే విధంగా ఈ యాడ్ సాగనుందట .

రోడ్డు ప్రమాదాల్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ అన్న జానకిరామ్ అలాగే తండ్రి హరికృష్ణ ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు , దాంతో ఎన్టీఆర్ కు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమై ఉంటుంది . ఆ బాధ ఎలాంటిదో ఎన్టీఆర్ కు ఎక్కువగా తెలుసు కాబట్టి కోహ్లీ తో కలిసి ఎన్టీఆర్ చెబితేనే బాగుంటుందని ఎంపిక చేశారట . త్వరలోనే కోహ్లీ – ఎన్టీఆర్ లపై ఆ యాడ్ చిత్రీకరించనున్నారు ఎన్ డి టివి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All