Homeటాప్ స్టోరీస్అల.. వైకుంఠపురంలో "సీతారామ్"

అల.. వైకుంఠపురంలో “సీతారామ్”

అల.. వైకుంఠపురంలో "సీతారామ్"
అల.. వైకుంఠపురంలో “సీతారామ్”

సినిమా వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్న వాళ్ళను గుర్తుపెట్టుకునే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా నిజజీవిత స్నేహితులలో త్రివిక్రమ్ & సునీల్ ఒకరు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలిసారంటే, ఖైరతాబాద్ రూమ్కి వెళ్లి కూర్చుంటామనీ, ఏ గెలుపు అయినా అక్కడినుండే పట్టుకోచ్చామనీ గురూజీ చెప్పారు. విలన్ వేషాలు ట్రై చేస్తున్న సునీల్ ని, కమెడియన్ గా ప్రయత్నించమని చెప్పి, అక్కడితో ఆగకుండా, ప్రతీ సినిమాకు ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసి సునీల్ కంటూ ఒక క్రేజ్ పెంచిన వ్యక్తి త్రివిక్రమ్. సునీల్ కూడా స్వయవరంతో మొదలెట్టి, నువ్వే – నువ్వే, చిరునవ్వుతో, అతడు, జల్సా, ఖలేజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, మన్మధుడు నుండి ఈమధ్య వచ్చిన అరవింద సమేత లో నీలాంబరి పాత్ర వరకూ త్రివిక్రమ్ క్రియేట్ చేసిన పాత్రలను ఎక్కడికో తీసుకెళ్ళాడు.

ఇప్పుడు మళ్ళీ అందరూ అల.. వైకుంఠపురంలో సునీల్ పాత్ర ఎలా ఉంటుందో అని అంచనాలు వేస్తున్నారు. ఇక మళ్ళీ సునీల్ కి జూలు సరిచేసి, దేశం మీదకు వదిలానని, గురూజీ ఇప్పటికే చెప్పారు. ఇక ఈ సినిమాలో అమృతం సీరియల్ నటుడు హర్షవర్ధన్ మరియు సునీల్ ట్రాక్ తోపాటు హీరో బన్నీ& సునీల్ కాంబినేషన్ సీన్లు కూడా అధిరిపోతాయని ఇండస్ట్రీ టాక్. ఇక మరొక నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisement -

చూద్దాం… ఒక బంతి, ఒక బంక్ శీను, ఒక పద్మావతి, ఒక రమణ, ఒక బాబీ, ఒక నీలాంబరి ఇలా ప్రతి క్యారెక్టర్ ని థియేటర్ నుండీ మనతోపాటు మన ఇంటికి తెచ్చి, మన లైఫ్ లో ఒక తెలియని స్నేహితుడిగా రిజిస్టర్ చేసిన గురూజీ ఇప్పుడు కూడా సీతారామ్ అనే గోదావరి స్లాంగ్ వెటకారం మాట్లాడే ఇంకొక స్నేహితుడిని మనకు కానుకగా ఇచ్చి, మన జేబులో ఒక 10 పంచ్ లు యాడ్ చేస్తాడని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All