Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్‌: కేర‌ళ లేదంటే రంప‌చోడ‌వ‌రం!

క‌రోనా ఎఫెక్ట్‌: కేర‌ళ లేదంటే రంప‌చోడ‌వ‌రం!

Sukumar searching locations for shooting
Sukumar searching locations for shooting

క‌రోనా వైర‌స్ కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం త‌ల‌కిందుల‌వుతోంది. భ‌యంతో వ‌ణికిపోతోంది. ఎప్పుడు ఎవ‌రికి వైర‌స్ సోకిందోన‌నే వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని భ‌యం గుప్పిట్లో చాలా మంది కాలాన్ని వెల్ల‌దీస్తున్నారు. దేశాధినేత‌లు సైతం భ‌యంతో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌జ‌లంతా సోష‌ల్ అవేర్‌నెస్‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అమెరికా లాంటి అగ్ర రాజ్యం క‌రోనా కార‌ణంగా ఆర్థిక మాంధ్యంలోకి దేశం వెళ్లే ప్ర‌మాదం వుంద‌ని భ‌య‌ప‌డుతోంది.

ఇక మ‌న దేశంలో వైర‌స్ చిన్న చిన్న‌గా వ్యాప్తి చెందుతూ పానిక్ సిట్యూవేష‌న్‌ని క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ వైర‌స్ క‌ట్ట‌డి కోసం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాధినేత‌ల‌కు సూచించారు. వెంట‌నే నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు. ఇదిలా వుంటే సినిమా షూటింగ్‌లు, స్కూల్స్‌ని బంద్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న సినిమా షూటింగ్‌ని ర‌ద్దు చేసుకున్నా లొకేష‌న్స్ వేట‌లో మాత్రం య‌మ బిజీ అయిపోయారు.

- Advertisement -

అల్లు అర్జున్‌తో సుకుమార్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసిన సుక్కు మ‌లి షెడ్యూల్‌ని బ‌న్నీతో కేర‌ళ అడ‌వుల్లో మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేశారు. కానీ అక్క‌డ క‌రోనా కేసులు న‌మోదు అవుతుండ‌టంతో షూటింగ్‌ని ర‌ద్దు చేసుకున్నారు. మ‌ళ్లీ షూటింగ్ కి దాదాపు రెండు వారాల టైమ్ వుండ‌టంతో లొకేష‌న్‌ల‌ని వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌. కేర‌ళ‌లో వ‌ర్క‌వుట్ కాక‌పోతే తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం, మారేడు మిల్లి ఫారెస్ట్‌ల‌లో లొకేష‌న్స్ వెతుకుతున్నార‌ట‌. ఈ అడ‌వుల్లో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. దీంతో క‌రోనా వ‌ల్ల సుక్కూకు భ‌లే క‌లిసొస్తోందే అని అంతా అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All