Homeటాప్ స్టోరీస్ఎంకరేజ్ చేయడంలో సుక్కూ తర్వాతే ఎవరైనా

ఎంకరేజ్ చేయడంలో సుక్కూ తర్వాతే ఎవరైనా

ఎంకరేజ్ చేయడంలో సుక్కూ తర్వాతే ఎవరైనా
ఎంకరేజ్ చేయడంలో సుక్కూ తర్వాతే ఎవరైనా

మనం ఎదిగితేనే సరిపోదు, మన చుట్టూ ఉన్నవాళ్ళ ఎదుగుదలలో కూడా భాగం కావాలి. వాళ్లకు మనవంతు సహకారం అందించగలగాలి. ఈ విషయంలో అందరికంటే ముందుంటాడు సుకుమార్. తన స్నేహితులు, శిష్యులను ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. కుమారి 21ఎఫ్ తో దర్శకుడిగా విజయాన్ని అందించిన సుకుమార్, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లేక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ సహాయసహకారాలు అందిస్తున్నాడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా ఒక సినిమా ఇటీవలే అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. చక్కిలిగింత అనే సినిమాను తెరకెక్కించిన వేమా రెడ్డి, సుకుమార్ శిష్యుడు కం కో రైటర్. అలాగే ప్రస్తుతం ఉప్పెన అనే సినిమాను తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సైతం సుకుమార్ శిష్యుడే కావడం విశేషం. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు ఈ సినిమాతో.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కిన కుమారి 21ఎఫ్ మొదటి సినిమా అయితే, దర్శకుడు రెండో సినిమా. గతంలో తనకు కొలీగ్ అయిన హరిప్రసాద్ జక్కా సినిమాల మీద ఆసక్తితో ఈ రంగంలోకి వస్తే తనను ఎంకరేజ్ చేస్తూ తానే దర్శకుడు అనే సినిమాను నిర్మించాడు. సుకుమార్ అన్న కొడుకు అశోక్ అందులో హీరో. అయితే దురదృష్టవశాత్తూ ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. చాలా కంఫర్ట్ ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి హరిప్రసాద్ సినిమాల మీద ప్యాషన్ తో ఇటువైపు వచ్చాడు. తొలి సినిమా ప్లాప్ అయినా కూడా సినిమాలను వదులుకోలేదు. మళ్ళీ ఎంతో కష్టపడి మరో సినిమాను అందుకున్నాడు. అదే ప్లే బ్యాక్.

- Advertisement -

90వ దశకంలోని ఒక అమ్మాయి, ఆ తరం అబ్బాయికి కాల్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి సుకుమార్ విచ్చేశాడు. సినిమా గురించి, తన స్నేహితుడు గురించి చాలా మంచిగా మాట్లాడాడు. అసలు ఈ కాన్సెప్ట్ తనే చేయాల్సిందని కానీ అవ్వలేదని కూడా చెప్పాడు. సుకుమార్ మాటలతో ఈ సినిమా మీద మంచి ఇంప్రెషన్ అయితే కలిగింది. కాన్సెప్ట్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో రిలీజైతే కానీ చెప్పలేం. ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు సుకుమార్. మరి హరిప్రసాద్ కెరీర్ ను ప్లే బ్యాక్ ఎటువంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All