Homeగాసిప్స్ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వస్తున్న సుజీత్

ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వస్తున్న సుజీత్

ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వస్తున్న సుజీత్
ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వస్తున్న సుజీత్

షార్ట్ ఫిలిమ్స్ తో మొదలైన సుజీత్ ప్రస్థానం చాలా త్వరగానే దర్శకుడి స్థాయికి చేరుకుంది. చాలా తక్కువ బడ్జెట్ ఏడు కోట్లలోనే శర్వానంద్ తో రన్ రాజా రన్ తీసి సూపర్ డూపర్ హిట్ సాధించాడు సుజీత్. సరిగ్గా పాతికేళ్ళు లేని కుర్రాడు ఇంత పెద్ద హిట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అదే అతనికి ఒక రకంగా శాపంగా మారింది. 2014లో రన్ రాజా రన్ విడుదలవ్వగా ఆ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ తో సినిమా తీసే భారీ అవకాశాన్ని సుజీత్ కు ఇచ్చింది. అయితే అప్పటికే ప్రభాస్ బాహుబలి సినిమాకు కమిట్ అయిపోవడంతో సుజీత్ వెయిట్ చేయాల్సి వచ్చింది. నిజానికి సుజీత్ అనుకున్న సాహో కథ ఐదేళ్ల క్రితంది. బాహుబలి మొదలవ్వడానికి ముందే ప్రభాస్ కు కూడా కథ నరేట్ చేసాడు. అయితే అప్పుడు బాహుబలి వల్ల వేరే సినిమా చేయడానికి కుదర్లేదు. దాంతో సుజీత్ కు వెయిటింగ్ తప్పలేదు. కథ చెప్పినప్పుడు దీన్ని అప్పటి ప్రభాస్ మార్కెట్ ను బట్టి ఒక 50 కోట్లలో చేయాలని అనుకున్నారు. అప్పటి ప్రభాస్ మార్కెట్ కు అది చాలా మంచి అమౌంట్.

అయితే ఎప్పుడైతే బాహుబలి విడుదలైందో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బాహుబలి వసూళ్ల ప్రభంజనాన్ని దేశవ్యాప్తంగా చూపించింది. వందల కోట్లు వసూళ్ల వచ్చి పడ్డాయి. ప్రభాస్ ను ఒక్కసారిగా నేషన్ వైడ్ హీరోగా గుర్తుపట్టడం మొదలుపెట్టారు. బాహుబలి 2 విడుదలయ్యాక నార్త్ జనాలు ప్రభాస్ అంటే పడి చచ్చిపోయే రేంజ్ కు వచ్చేసారు. బాలీవుడ్ సినెమాలన్నిటి కంటే బాహుబలి 2 ఎక్కువ వసూలు చేసింది. ఈ పరిస్థితితో యూవీ క్రియేషన్స్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు.

- Advertisement -

ముందు అనుకున్న బడ్జెట్ లో సినిమా తీస్తే ప్రభాస్ ప్రస్తుత మార్కెట్ కు న్యాయం చేయలేరు. అందుకే సాహో బడ్జెట్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్లిపోయారు. బడ్జెట్ పెరిగింది కాబట్టి దాన్ని ఖర్చు పెట్టడానికి అనవసర హంగుల జోలికి వెళ్లారు. భారీ తారాగణాన్ని తీసుకున్నారు. ఇక్కడే యూవీ క్రియేషన్స్ తప్ప్పు చేసారు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవమున్న సుజీత్ చేతికి 300 కోట్ల బడ్జెట్ అంటే అది సాహసమే. మొదటినుండి ట్రేడ్ ఈ విషయంలో భయపడుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే సుజీత్ ఏదో చేయాలన్న కంగారులో ఏదో చేసేసాడు. ఫలితంగా సాహో అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఈ విషయంలో సుజీత్ ను నిందించడానికి కూడా ఏం లేదు. అతనికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడమే తప్పు.

సాహో ఫలితం తర్వాత సుజీత్ కు పెద్ద హీరోలెవ్వరూ అవకాశాలిచ్చేలా కనిపించట్లేదు. అందుకే సుజీత్ తన మొదటి హీరో శర్వానంద్ నే అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. రన్ రాజా రన్ తరహాలో లిమిటెడ్ బడ్జెట్ లో ఒక మంచి ఎంటర్టైనర్ ను సిద్ధం చేయాలనుకుంటున్నాడు. మరి శర్వానంద్ అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All