
ఎప్పుడైనా ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు, అలా అని చెప్పి వారి మేథస్సుకు పదును పెడదామన్న ఉద్దేశంతో వారిని అయోమయానికి గురి చేయకూడదు. సుకుమార్ 1 నేనొక్కడినే సినిమాతో అలాంటి తప్పే చేసాడు. దాంతో సినిమా ఎంత తెలివిగా తీసినా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకోక తప్పలేదు.
చూస్తుంటే ఇప్పుడు సాహో విషయంలో సుజీత్ ఇలాంటి తప్పే చేసాడు. సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి కానీ అసలు అప్పటిదాకా ఏం జరిగిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు. అక్కడ భారీ ఛేజింగ్ సీన్లు జరుగుతున్నా కానీ అసలు అవి ఎందుకు వస్తున్నాయో, ఆ ఛేజ్ దేనికి అన్నది ప్రేక్షకుల బుర్రకు ఎక్కలేదు.
పైగా సుజీత్ సినిమా అర్ధం కావాలంటే రెండోసారి చూడాలి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే అక్కడ ప్రేక్షకుల మేథస్సుని తక్కువ చేస్తున్నట్టే కదా. అయితే ఏ ప్రేక్షకుడు కూడా అదేదో పరీక్షలాగా మరోసారి చూసి నేర్చుకుందాం అని కోరుకోడు. ఏ దర్శకుడైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే అందరికీ మంచిది.